Mana Aksharam
  • Home
  • Entertainment
  • ఆ లిస్టులో మొదటి స్థానంలో మన విజయ్ దేవరకొండ
Entertainment

ఆ లిస్టులో మొదటి స్థానంలో మన విజయ్ దేవరకొండ

vijay devarakonda tops the forbes most desirable man 2018

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మొదట్లో యూత్ కు మాత్రమే పరిమితమైన ఆ క్రేజ్ స్లోగా మిగతా సెక్షన్ల ప్రేక్షకులకు కూడా పాకింది. రీసెంట్ గా హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన ‘హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు 2018’ లో విజయ్ దేవరకొండ మొదటి స్థానంలో నిలిచి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.
టాలీవుడ్లో మహేష్ బాబు..ప్రభాస్.. చరణ్…ఎన్టీఆర్.. అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఎంతో మంది ఉండగా వారందరినీ దాటిసి మొదటి స్థానం దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. గత ఏడాది హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో విజయ్ దేవరకొండ రెండవస్థానంలో నిలిచాడు. ఈ సారి మొదటి స్థానంలో నిలవడం గొప్ప విషయమే. గత ఏడాది సర్వేలో మొదటి స్థానం సాధించిన మోడల్ బసీర్ అలీ ఈసారి ఐదవ స్థానానికి పరిమితం అయ్యాడు.

మరోవైపు చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు 2018 లో విజయ్ దేవరకొండకు మూడవ స్థానం లభించింది. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా రెడ్డిగారు తన సత్తా చాటుతున్నారన్నమాట. విజయ్ దేవరకొండ కొత్త సినిమాల విషయానికి వస్తే భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో విడులకి సిద్ధంగా ఉంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

Related posts

అత్తారింటికి దారేది రీమేక్.. శింబు అల్ట్రా స్టైలిష్ లుక్ లీక్!

Manaaksharam

బీచ్ ఒడ్డున అందమైన భామలు!

ashok p

మోహన్ బాబుతో జబర్దస్త్ అనసూయ

ashok p