Mana Aksharam
  • Home
  • Entertainment
  • ఉచిత సలహాలు కోసం చాయ్- సామ్ లను సంప్రదించండి
Entertainment

ఉచిత సలహాలు కోసం చాయ్- సామ్ లను సంప్రదించండి

నాగ చైతన్య – సమంతా జంటగా ‘మజిలీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రీసెంట్ గా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. లిరికల్ సాంగ్స్ ను ఒకదాని తర్వాత మరోటి విడుదల చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలలో ఉన్నారు. ఇంతటితో ఆగకుండా #AskChaySam పేరుతో ఒక ప్రమోషన్ ఈవెంట్ ను రన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నెటిజనులు టాలీవుడ్ క్యూట్ కపుల్ చైతు-సమంతాలను రిలేషన్ షిప్ కు సంబంధించిన సలహాలు సూచనలు అడగొచ్చు. ప్రేమ.. వివాహం లాంటి విషయాలే ఇందులో ప్రధానంగా అడగాల్సి ఉంటుంది.

నెటిజనులు తమ ప్రశ్నలను #AskChaySam అనే హ్యాష్ టాగ్ ను జోడించి అడిగితే సమంతా .. చైతూలు ప్రమోషన్స్ సమయంలో వాటికి సమాధానం ఇస్తారు. ఆల్రెడీ ఒక నెటిజనుడు ప్రశ్న అడగడం దానికి సమంతా ఫ్యాన్ అన్సర్ ఇవ్వడం.. ఆ ట్వీట్ ను సమంతా రీ ట్వీట్ చేయడం కూడా జరిగిపోయింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. “అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కనుక లవ్ లో ఉంటే ఇద్దరిలో ఎవరు తమ ఫీలింగ్స్ ను ముందు ఎక్స్ ప్రెస్ చేయాలి? మీ విషయంలో ఏం జరిగింది?” దీనికి సమాధానం ఒక అమ్మాయి ఇలా ఇచ్చింది “జవాబు సమంతా ఇచ్చినా సమంతా ఫ్యాన్ ఇచ్చినా ఒకటే.. ఇదిగో ఆన్సర్ అంటూ- అబ్బాయిలే ముందు ఎక్స్ ప్రెస్ చేయాలి” అని రిప్లై ఇచ్చింది. సమంత ఎం చేసిన కొత్తగానే ఉంటుంది.. అపుడు యూ-టర్న్ సినిమా కోసం డాన్స్ వీడియో ని ప్రమోట్ చేసింది ఇక ఇపుడేమో ఇలా.. ప్రమోట్ చేయడం లో నే తర్వాతే ఎవరైనా.. నువ్ సూపర్ సామ్..

Related posts

అందరివాడు మా చిరంజీవి : రోజా

ashok p

‘సరైనోడు’ దొరికాడు..

Manaaksharam

హీరోయిన్ అమలాపాల్ అరెస్ట్

ashok p