Mana Aksharam
  • Home
  • Health
  • ఎక్ ఫల్..సౌ భీమారియా
Health

ఎక్ ఫల్..సౌ భీమారియా

pomegranate benefits in telugu

అనారోగ్యం బారీనపడినప్పుడు పలు రకాల పండ్లను తింటారు. వాటిలో ఎక్కువగా తినేది దానిమ్మ పండు. ఈ దానిమ్మ పండుకు హిందీలో ఒక సామెత ఉంది. ఎక్ ఫల్…. సౌ భీమారియా…అంటారు. అంటే వందరోగాలకు దానిమ్మ పండు ఒక సమాధానం అని అర్ధం. ఈ పండు మానవ శరీరానికి మంచి ఔషధంగా పని చేస్తుంది. శారీర రుగ్మతలను తగ్గించడంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. దానిమ్మను గుండెకు బలాన్ని ఇచ్చే ఒక మెడిసిన్ గా ప్రాచీనా గ్రంధాలలో ఆరోగ్య వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ పండులో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, పొటాషియం, ఫైబర్, క్యాన్సర్ వ్యాధిని అరికట్టె ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ గిజలు, దానిమ్మ రసం గుండెకు మంచి టానిక్ గా పని చేస్తాయని వైద్యులు చెబుతున్నాయి. గుండె జబ్బు నివారణకు దానిమ్మ మంచిదని వైద్యులు చేసిన పలు అధ్యయనాల్లో వెల్లడింది. దీనిలో ఉండే యాంటిఆక్సిడెంట్స్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే దమనుల గోడలపై కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. అలాగే కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా దానిమ్మ ఎంతగానో దోహదపడుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్రమం తప్పకుండ దానిమ్మను తినడం వలన రక్తనాళాలు శుభ్రపడి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దాంతో రక్తపోటు నిలకడగా ఉంటుంది. బిపి అధికంగా ఉన్న వారికీ దానిమ్మ వరంలా పని చేస్తుంది. దానిమ్మ తొక్కను దంచి, నీటిలో వేసి వేడి చేసి అందులో కొంచెం తేనే కలుపుకొని తాగితే అసిడిటి సమస్య నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అల్సర్ నివారణకు దానిమ్మను మించిన ఔషదం లేదని వైద్యులు పేర్కొన్నారు. తీవ్ర దగ్గు సమస్యతో బాధపడేవారు దానిమ్మ రసంలో కొద్దిగా అల్లం రసం, తేనే కలుపుకొని మూడు పూటలు తాగితే త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధుల నివారణకు దానిమ్మ ఎంతగానో మేలు చేస్తుంది. శరీరంలోని యూనినారి వ్యవస్థను మెరుగుపరిచి… మూత్ర సంబందిత వ్యాధులు రాకుండా, మూతపిండల్లో ఏర్పడే చిన్న చిన్న రాళ్ళను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. దానిమ్మలో ఉన్న యాంటిఆక్సిడెంట్లు శరీరంలోని టాక్షిన్లను బయటకు పంపి, క్యాన్సర్ కారకాలైన ట్యూనర్ల పెరుగుదలను అడ్డుకుంటుంది. అలాగే ఒంట్లోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలెస్టరాల్ ని పెంచడంలో దోహదపడుతుంది. దానిమ్మ ఆకుల కషాయాన్ని పుక్కిలించడం వలన, వీటి రసంతో దంతాలను శుభ్రపరచడం వలన దంత సమస్యలు తొలగి, నోటి దుర్వాసన, నోటి ఇన్ పెన్షన్లు తగ్గిపోతాయి. చిన్న పిల్లలకు, వృద్ధులకు దానిమ్మ రసం తాగించడం వలన జ్ఞాపకశక్తి పెరిగి, మెదడు చురుకుగా పని చేస్తుంది. కడుపులో వికారం, కడుపుమంట, ఆకలిలేమి సమస్యలు ఉన్నవారు ఈపండు రసంలో కాస్తా తేనెను కలుపుకొని తాగడం వలన ఆ సమస్యలు తగ్గిపోతాయి. వీటిలో ఉండే బి, సి విటమిన్లు శరీరానికి మాయిశ్చరైజర్ లా పని చేస్తాయి. చర్మపై ఏర్పడే మృతకణాలను, ముడతలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

Related posts

ఉపవాసంతో ఇవీ లాభాలు..

Manaaksharam

చలికాలానికి చక్కని ఆరోగ్య చిట్కాలు..

ashok p

గ్రీన్‌ టీ తాగుతున్నారా? ఇవి తప్పక తెలుసుకోవాలి..

ashok p