Mana Aksharam
  • Home
  • Entertainment
  • ఎట్టకేలకు వర్మ కన్ఫామ్ చేసారు
Entertainment

ఎట్టకేలకు వర్మ కన్ఫామ్ చేసారు

rgv confirmed lakshmi's ntr release

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించారు. అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితానికి సంబంధించిన మరో కోణం అంటూ వర్మ బాలయ్య బాబు తీసిన కథానాయకుడు మహానాయకుడుకి పోటీగా ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి నుంచి చిత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమాను ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ త్వరలో ఏపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినిమాను విడుదల చేయడం సబబు కాదని పలువురు తెదేపా కార్యకర్తలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో సినిమా విడుదలను నిలిపివేయాలని సెన్సార్‌ బోర్డు చిత్రబృందాన్ని ఆదేశించింది.సెన్సార్ కూడా చేయబోయామని ప్రకటించింది. దాంతో వర్మ సెన్సార్‌ బోర్డుతో చర్చలు జరిపి విడుదల తేదీని 29కి మార్చారు. త్వరలో కడపలో జరిగే ఓ బహిరంగ సభలో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకను నిర్వహిస్తానని వర్మ గతంలో ప్రకటించారు. చూద్దాం మరి సినిమా ఇపుడైనా విడుదల అవుతుందో ఇంకెన్ని అవాంతరాలు వస్తాయో..

Related posts

“నేనే మొదలు పెట్టాను .. నేనే పూర్తి చేస్తాను”‘ఐరా’ ట్రైలర్‌

Masteradmin

గజిని 2 తెరకెక్కబోతోందా?

Manaaksharam

#RRR నుండి డైసీ అవుట్..ఏమైఉంటుంది?

Manaaksharam