ఎన్‌కౌంటర్ పై సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్:అందుకే ఎన్‌కౌంటర్ చేసాం

దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన సీపీ సజ్జనార్ దీనిపై ప్రెస్ మీట్ పెట్టారు.ఇందులో అసలు ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది ఎలా జరిగిందోవివరించారు. .తెల్లవారు జామున నింధితులను సీన్ రిక్రియేషన్ కోసం ఘటన స్థలానికి తీసుకెళ్లామని..దిశకు సంబంధించిన కొన్ని వస్తువులు వాచ్ ఫోన్ కోసం అడుగగా వాళ్ళు అక్కడున్నాయి ఇక్కడున్నాయి అని మా ద్రుష్టి మళ్లించి రాళ్ల దాడి చేసారని అంతేకాక పోలీసుల వెపన్స్ తీసుకోవటంతో సరెండర్ అవాలని వార్నింగ్ ఇచ్చామని ఐన కూడా కరడుగట్టిన నిందితులు దాడి చేయడానికి ప్రయత్నించగా ఆత్మ రక్షణ కోసం ఫైరింగ్ చేశామని ఆ దాడిలో నలుగురు మృతి చెందారని తెలిపారు.ఈ ఘటన తెల్లవారు జామున 5 గంటల సమయంలో జరిగిందని తెలిపారు సీపీ సజ్జనార్.ఈ సందర్బంగా సజ్జనార్ మీడియా కు ఒక రిక్వెస్ట్ చేసారు.దిశ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని ఒక అమ్మాయికి సమందించిన విషయం కాబట్టి ఆమె గురించి తప్పుగా రాయొద్దని తెలిపారు.మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబాలకు అప్పగిస్తామని తెలిపారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*