Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • ఎవరికీ భయపడను, తప్పు చేస్తే ఆత్మహత్యే: మోహన్ బాబు
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

ఎవరికీ భయపడను, తప్పు చేస్తే ఆత్మహత్యే: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు నటుడు, మాజీ ఎంపీ, శ్రీ విద్యానికేతన్ సంస్థల అధినేత మోహన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన మంగళవారం జాయిన్ అయ్యారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ… వైసీపీలో చేరడానికి ఎవరినీ అడగాల్సిన అవసరం లేదని, ఇది ప్రజాస్వామ్యం, నా ఇష్టమొచ్చిన పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితమే జగన్ పార్టీలో చేరాలని అడిగారని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.

పదవులు ఆశించి రాలేదని ఈ సందర్భంగా మోహన్ బాబు స్పష్టం చేశారు. 17 సంవత్సరాల క్రితమే రాజ్యసభకు వెళ్లొచ్చాను. బిజేపీకి సపోర్ట్ చేసి 18 శాతం వచ్చిన రోజునే నాకు ఏ పదవి ఇస్తారని అడిగి ఉండొచ్చు. నేను పదవులు కావాలనుకుంటే ఇప్పటికే చాలా వచ్చేవని తెలిపారు. తన కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, తమకు రూ. 19 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు.

‘‘నేను నోరు విప్పితే చంద్రబాబు నవరంద్రాలు మూసుకుపోతాయన్నారు. ఎందుకు నోరు విప్పడం లేదు? ఎవరికి భయపడుతున్నారు?” అనే ప్రశ్నకు మోహన్ బాబు స్పందిస్తూ.. నా ప్రాణం పోయే వరకు ఎవరికీ భయపడను. సమాజంలో చేయరాని పని చేసిన రోజున తలవంచుకోవాలి, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి. చంద్రబాబుకు భయపడటం లేదు. చంద్రబాబుకు నవరంద్రాలు అనే పదాన్ని నేను ఉపయోగించలేదు. దయచేసి ఆ లెటర్ సరిగా చదవండని మోహన్ బాబు తెలిపారు.

Related posts

తిరుమలలో తప్పిపోయిన మాజీ ఎమ్మెల్యే

admin

జక్కంపూడి రాజా దంపతులపై ఎస్‌ఐ దౌర్జన్యం

admin

సైకిల్ కి సైకిల్ కి రెండు చక్రాల్లా బీజేపీ, జనసేన!

admin