Mana Aksharam
  • Home
  • Manavi
  • ఏకాగ్రత పెంచుకోవాలా అయితే ఇవి తినండి
Health Manavi

ఏకాగ్రత పెంచుకోవాలా అయితే ఇవి తినండి

best benefits of acrots or walnuts

కుంగుబాటు బారినపడకూడదని అనుకుంటున్నారా? ఏకాగ్రత పెంచుకోవాలని భావిస్తున్నారా? అయితే అక్రోట్లు (వాల్‌నట్స్‌) తిని చూడండి. గింజపప్పులు అసలే తిననివారితో పోలిస్తే.. వీటిని తీసుకునేవారికి కుంగుబాటు ముప్పు 8% తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ఎంజెలిస్‌ పరిశోధకులు గుర్తించారు. అదే అక్రోట్లు తీసుకునేవారికైతే 26% వరకు ముప్పు తక్కువగా ఉంటుండటం విశేషం. వీటితో శక్తి పుంజుకోవటంతో పాటు ఏకాగ్రత, ఆశావహ దృక్పథం కూడా బాగా మెరుగవుతున్నట్టూ తేలింది. వాల్‌నట్స్‌లో ప్రత్యేకమైన కొవ్వు ఆమ్లాలు.. ముఖ్యంగా ఒమేగా 3 అల్ఫాలినోలిక్‌ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండెకు, మెదడుకు మేలు చేస్తాయన్నది తెలిసిందే. ఇవి కుంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పట్టటానికీ తోడ్పడుతున్నట్టు తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

Related posts

రైస్ కుక్కర్లో అన్నం వండుకొని తింటున్నారా?అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెల్సుకోవాలి..!

Manaaksharam

జుట్టు రాలుతోందా..అయితే..

admin

పొడవాటి జడ కోసం కర్పూర నూనె..

admin