Mana Aksharam
  • Home
  • Breaking
  • ఏపీలోతెలుగుదేశం నామ రూపాలు లేకుండాపోతుంది . రామచంద్రయ్యజ్యోసం
Andhra Breaking News Politics

ఏపీలోతెలుగుదేశం నామ రూపాలు లేకుండాపోతుంది . రామచంద్రయ్యజ్యోసం

మంత్రులంతాదారుణంగా పరాజయం పాలవుతారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య పేర్కొన్నారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్‌ కమిషన్‌ను తప్పు పట్టడం బాబు ఇష్టం కానీ తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీద ఆరోపణలు చేయడం బాబుకు తగదన్నారు. ఓటింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు బాబు విఫల ప్రయత్నం చెయ్యలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎలక్షన్‌ కమిషన్‌ మీద తనకు నమ్మకం లేదంటారు.. మళ్లీ ఆయనే ఈసీ దగ్గరకు వెళ్తారని ఎద్దేవా చేశారు.ఈ ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌ పరిణీతి చెందిన రాజకీయ నేతగా ఎదిగారిని పేర్కొన్నారు. చంద్రబాబు ఓటింగ్‌కు ఒక రోజు ముందు జనాల అకౌంట్లో డబ్బులేసినా జగన్‌ ఎవరికి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మరి కొద్ది రోజుల్లోనే రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి.. ప్రజాస్వామ్య విజయం రాబోతుందని రామచంద్రయ్య ధీమా వ్యక్తం చేశారు.

Related posts

ఉత్తమ్ వ్యాఖ్యలతో రాజకీయ కలకలం..!

admin

అయ్యో .. ఆ సీన్ మిస్ అయ్యానే..! : కేటీఆర్

admin

నెమ్మదిగా జగన్ అడుగులు!

admin