Mana Aksharam
  • Home
  • Breaking
  • ఏపీలో మారుతున్న సమీకరణలతో రాహుల్ చూపు ఎవ్వరివైపు?
Andhra Breaking News Politics

ఏపీలో మారుతున్న సమీకరణలతో రాహుల్ చూపు ఎవ్వరివైపు?

2014 కు ముందు కాంగ్రెస్ చేసిన ఘోర త‌ప్పిదానికి భారీ మూల్యంచెల్లించుకోక తప్పలేదు . వైఎస్ మ‌ర‌ణం త‌రువాత పుట్టెడు దుఃఖం లోఉన్నజగన్ పై అక్ర‌మాస్తుల కేసుల మోపి జ‌గ‌న్‌ను జైలుకు పంపించింది కాంగ్రెస్‌. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు విభ‌జించిన కాంగ్రెస్ 2014 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ పతనం అయ్యింది.అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి కాస్త జ్ణానోద‌యం అయిన‌ట్లుంది. జ‌గ‌న్‌కు చేసిన ద్రోహం తెలసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు జ‌గ‌న్‌తో దోస్తీకి సిద్ద‌మ‌వుతోంది. 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీదే అధికారం అని తేలిపోవ‌డంతో కాంగ్రెస్ జ‌గ‌న్ స‌పోర్ట్ కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. కేంద్రంలో ఏపార్టీకి మెజారిటి రాక‌పోతె ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంలో అప్పుడు ప్రాంతీయ పార్టీలే ముఖ్య‌పాత్ర పోషిస్తాయి. ఏపార్టీ కూడా స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాద‌ని స‌ర్వేలు చెప్ప‌డంతో కాంగ్రెస్ ఇప్ప‌టినుంచె మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకొనేందుకు పావులు క‌దుపుతోంది.దీనిలో భాగంగానె జగన్ తో సయోధ్య కోసం రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జ‌గ‌న్ మ‌ద్ద‌తి ఇస్తే తప్పుడు కేసులు పెట్టినట్లు అంగీకరిస్తామని, తాము అధికారంలోకి వస్తే కేసులను క్లోస్ చేస్తామని, జగన్ కోరినట్లుగా ప్రత్యేక హోదా ఇస్తామని, అందుకోసం గులాం నబీ ఆజాద్ ను రాయబారానికి వినియోగించుకుంటున్నట్లు బోగట్టా . ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నాయ‌కులు జ‌గ‌న్ ను టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మాత్రం జగన్ గురించి కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ మాట్లాడవద్దని కూడా ఆదేశాలు హుకుం చేసినట్లు పార్టీవ‌ర్గాల‌నుంచి స‌మాచారం. ఇందులో ఎంత నిజం అనేది వేచి చూడాల్సిందే .
దే .

Related posts

హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. రోప్ బ్రిడ్జి..

Manaaksharam

కడసారి చూపుకోసం భారీగా తరలివస్తున్న ప్రజలు

admin

కార్పోరేట్ కామాంధులు..!

admin