Mana Aksharam
  • Home
  • Sphoorthi
  • ఒక కాలు లేకున్నా ఎందరికో స్ఫూర్తి దాయకం సుధాచంద్రన్
Sphoorthi

ఒక కాలు లేకున్నా ఎందరికో స్ఫూర్తి దాయకం సుధాచంద్రన్

సుధా చంద్రన్ సెప్టెంబర్ 21 1964 న కేరళ లోని కన్నూర్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె ముంబైలో గల మిథీబాయి కళాశాల నుండి బి.ఎ డిగ్రీని ఆ తర్వాత ఎం.ఎ డిగ్రీని పొందారు. జూన్ 5 1981 న ఆమె ముంబై నుండి తమిళనాడుకు విహారయాత్ర సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడింది. వైద్యులు ఆమె కాలికి తగిలిన గాయానికి కట్టుకట్టారు. రెండు వారముల తర్వాత ఆమె మద్రాసు వచ్చి అచ్చటి వైద్యులను సంప్రదించగా వారు ఆ గాయం కారణంగా ఆమె కాలు తొలగించుటే సరియైన మార్గం అని చెప్పారు. ఆమెకు ఒక కాలిని తొలగించారు. ఆమె జైపూర్ లో వైద్యులు ‘జైపూర్ కాలు’ ను కృత్రిమంగా అమర్చారు.ఆ తర్వాత ఆమె ఆత్మ సడలని విశ్వాసంతో కృషిచేసి ఆ కృత్రిమ కాలితోనే నాట్య ప్రదర్శనలిచ్చి అందరినీ అబ్బురపరిచారు. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల నుండి ఆహ్వానాలు లభించాయి. ఆమెకు అనేక అవార్డులు లభించాయి. ఆమె భారతదేశంతోపాటు ఐరోపా, కెనడా అంరియు మధ్య తూర్పు దేశాలలో అనేక ప్రదర్శనలిచ్చారు. ఆ తర్వాతి కాలంలో ఆమె సినిమా రంగం మరియు టెలివిజన్ రంగంలో ప్రవేశించారు. ఆమెకు ప్రమాదం జరిగిన తర్వాతే ఈ గుర్తింపులన్నీ లభించాయి. ఆమె అనేక మందికి స్ఫూర్తిప్రదతగా నిలిచారుఆమె 1984 లో తెలుగులో మయూరి సినిమాలో ఆమె జీవిత చరిత్రకు ప్రభావితురాలైన నృత్యకారిణిగా నటించారు. 1986 లో ఆమె హిందీలో “నాచే మయూరి”లో నటించారు. ఆమె తర్వాతి కాలంలో “మయూరి బాలికా గా గుర్తింపబడ్డారు అనేక తెలుగు. హిందీ. తమిళ మరియు ఇతర భాషలో బుల్లితెర నటిగా ఎంతో పేరు తెచ్చుకుంది సుధా చంద్రన్ . కాలు లేదు అని అధైర్య పడక జైపూర్ కుత్రిమ కాలు తో అద్భుతాలు చేసింది ఎందరికో స్ఫూర్తి గా నిలిచింది .

 

Related posts

అక్క పెళ్లి కోసం ,తండ్రికి ఆసరాగా నిలిచిన భారత అథ్లెట్.

Manaaksharam

సాహో.. ఎరీనా

admin

ధైర్యం విసిరిన రాకెట్టు

Masteradmin