Mana Aksharam
  • Home
  • Health
  • ఓట్స్ లాభాలేంటి?
Health Manavi

ఓట్స్ లాభాలేంటి?

benefits of oats

ఈ మధ్యకాలంలో ఓట్స్‌ అనే పేరు ప్రబలంగా వినపడుచున్నది. ఇది ధనికుల ఆహారం. ఖరీదు చాలా ఎక్కువ. పేదలకు, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండదు. అందువలన కేవలం హైక్లాస్‌ సూపర్‌ మార్కెట్లలో మాత్రమే లభ్యమయ్యేది. అయితే, అల్లోపతి వైద్యుల పుణ్యమా అని ప్రస్తుతం మధ్య తరహా కిరాణాషాపులలో కూడా విరివిగా లభిస్తున్నది. ఇది ప్రధానంగా విదేశాలలో పండే పంట. ఇప్పటికీ విదేశాల నుండే దిగుమతి చేసుకొనబడుతున్నది. ఓట్స్‌ ధర ఎక్కువగా ఉండటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఓట్స్‌ సర్వరోగనివారిణిగా ప్రచారం చేయబడుతున్నది. దీనికి కారణం ఏమిటో తెలుసుకోవటం అవసరం. ఓట్స్‌ కూడా ఇతర ధాన్యాహారాల మాదిరిగా గడ్డి జాతికి చెందినదే. ఓట్స్‌ కూడా ఒక రకమైన బియ్యమే. బాగా దంచబడి, పల్చగా చేయబడిన ఓట్స్‌ మనకు లభ్యమవ్ఞతున్నాయి. ఓట్స్‌లో కొంతమేరకు పిండి పదార్థం తక్కువగా ఉండటం, నీటిలో కరిగే పిప్పి పదార్థం ఎక్కువగా ఉండటం వలన సులభంగా జీర్ణమైన మంచి శక్తినిస్తుంది. ఓట్స్‌ ప్రాధాన్యం పెరగటానికి కారణం ఇదే. నాడీమండల, నరముల నిస్త్రాణను నివారించటానికి, మర్మావయములకు చెందిన వ్యాధులను నివారించటానికి ఈ అవినాసటైవా ఉపయోగించబడుతున్నది.ఓట్స్‌ ధాన్యాన్ని జావగా ఉపయోగించుకోవచ్చు. ఉప్మా గాను సేవించవచ్చు. ఓట్స్‌ జావను మజ్జిగతో కలిపి ప్రతిరోజు ఒక గ్లాసు తీసు కుంటే నరాల నిస్త్రాణ తగ్గి శరీరం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది.

Related posts

చలికాలంలోనూ సన్ స్క్రీన్ తప్పనిసరి..!

admin

స్నానం ఇలా చేస్తున్నారా? అయితే చాలా డేంజర్..

admin

వేసవిలో మంచు ముక్కలతో ముఖాన్ని మెరిపించండిలా

Manaaksharam