Mana Aksharam
  • Home
  • Breaking
  • కన్నుల పండుగగా సాగిన శ్రీరాముని శోభా యాత్ర .
Andhra Breaking News Telangana

కన్నుల పండుగగా సాగిన శ్రీరాముని శోభా యాత్ర .

శ్రీరామ నవమి శోభాయాత్ర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున విధుల్లోకి తరలివచ్చారు. వీధుల్లో కాషాయ జెండాలు రెపరెపలాడాయి. యాత్రలో ప్రదర్శించిన వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఆకట్టుకున్నాయి. భాగ్యనగర్‌ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్‌ ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. సమితి నాయకుడు డాక్టర్‌ భగవంతరావు ఆధ్వర్యంలో శోభాయాత్రను కనుల పండువగానిర్వహించారు. మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథా ఆధ్వర్యంలో ధూల్‌పేట గంగాబౌలిలో సీతారాముల దర్బార్‌కు పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ప్రత్యేక బ్యాండ్‌ మేళాలు, డీజేలు, యువత ఆటాపాటలతో శోభాయాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక నేతలు భక్తులకు మజ్జిగ, మంచినీళ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. శోభాయాత్ర మార్గంలో భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో బేగంబజార్, ధూల్‌పేట్, మంగళ్‌హాట్‌ ప్రాంతాల్లోని వీధుల్లో రద్దీ నెలకొంది ముఖ్యంగా భారతమాత, చత్రపతి శివాజీ మహరాజ్, వానరసేన, శ్రీరామ్‌ మహావిగ్రహం (కన్నులు మూస్తూ తెరుస్తూ ఉండడం విశేషం), సీతారాముల పల్లకి సేవ, రాధాకృష్ణులు, రాణి అవంతిబాయి, హనుమాన్‌పై శ్రీరామ్‌ రామబాణం తదితర విగ్రహాలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రణవీర్‌రెడ్డి, చాంద్‌పాషా, శంకర్‌ బందోబస్తును పర్యవేక్షించారు.

Related posts

ప్రగతి భవన్‌లో ప్రముఖులు!

admin

బారత రాజకీయ చరిత్రలో జగన్ ఒక ప్రభంజనం..!

admin

జనసేనపై చంద్రబాబు వ్యాఖ్యల సారాంశం ఏంటి?

admin