Mana Aksharam
  • Home
  • Recipes
  • కమ్మటి కొర్రమీను
Recipes

కమ్మటి కొర్రమీను

korramenu fish curry in telugu

కావల్సినవి:

కొరమీను చేప – ఎనిమిది వందల గ్రా, (రెండు వందల గ్రా చొప్పున కట్ చేసుకోవాలి), తాజా అల్లం, వెల్లుల్లి రెబ్బలు – వంద గ్రా ,పుదీనా ఆకు – రెండు వందల గ్రా, పచ్చిమిర్చి – డెబ్భై అయిదు గ్రా, పొద్దుతిరుగుడు నూనె – యాభై ఎంఎల్‌, తాజా కొబ్బరి తురుము – వంద గ్రా, ఉప్పు – సరిపడా , వాము – పది గ్రా, అరటిఆకులు – నాలుగు.

తయారీ:

ముందుగా కడిగిన పుదీనా ఆకులు, అల్లం తరుగు, కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తీసుకుని నీళ్లు చేర్చకుండానే మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇందులో వాము, ఉప్పు కలపాలి. ఇప్పుడు ఒక్కో అరటి ఆకును చతురస్రాకారంలో కత్తిరించి నూనె రాయాలి. నాలుగు చేపముక్కల్ని ఒక్కో ఆకుపై ఉంచి.. పైన మసాలా మిశ్రమం రాసి చుట్టూ మూసి అవసరమైతే దారం చుట్టాలి. వీటిని ఆవిరిమీద ఇరవై నిమిషాలు ఉడికించి తీసేయాలి. వేడివేడిగా కమ్మగా ఉండే కొర్రమీను కర్రీ రెడీ అయినట్లే..

Related posts

అటుకుల దద్ధ్యోదనం

admin

ఆమ్‌చూర్ కర్రీ తయారీ..

admin

బీరకాయ బజ్జీ తయారీ విధానం

Masteradmin