Mana Aksharam
  • Home
  • Health
  • కర్వేపాకు ప్రయోజనాలు
Health

కర్వేపాకు ప్రయోజనాలు

health benefits of curry leaves

మనం ప్రతిరోజు వంటకాలలో ఎన్నో రకాల ఆకులను వాడుతుంటాం. వంటకు రుచి రావాలని పలు ఆకులను ఉపయోగిస్తాం. ఆ ఆకులలో ఒకటి కరివేపాకు. ఇది వంటలకు మంచి రుచిని, చక్కని సువాసనను ఇవ్వడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ ఆకులో ఎన్నో ఔషద గుణాలున్నాయి. కానీ ఈ విషయం చాలామందికి తెలియక… ఆకే కదా అని తినకుండా ప్రక్కన పెడుతారు. ఈ కరివేపాకుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కరివేపాకు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారికి కరివేపాకు చక్కని ఔషదం. ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అంతేకాకుండా కరివేపాకుని నమిలి మింగడం వలన చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. కరివేపాకు శరీరంలోని పేరుకుపోయే కొవ్వుని నియంత్రిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు రోజు నాలుగు ఆకులను తినడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని బ్యాడ్ కొలస్ట్రాల్ తగ్గించడంతో పాటు శరీర బరువుని తగ్గించడంలో సహాయపడుతుంది. కరివేపాకులో విటమిన్ ఎ సమృద్దిగా లభ్యమవుతుంది. అందువల్ల కరివేపాకుని నిత్యం తినడం వల్ల కళ్ల సమస్యలను దరీచేరకుండా చూసుకోవచ్చు. ఇది కంటి చూపుని మెరుగుపరుస్తూ రేచీకటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. కరివేపాకులో ఉండే ఔషద గుణాలు వెంట్రుకలు రాలడం, జుట్టు పలుచబడడం, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వంటి సమస్యలను దూరం చేసి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు మూత్రసంబంధిత సమస్యలను… రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కూడా కరిగించాతంలో కరిగించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇది అధిక రక్తపోటుని కూడా అదుపులో ఉంచుతుంది. కరివేపాకును ఆరోగ్యం పరంగానే కాకుండా మంచి సౌంధర్య సాధనంగా కూడా చెప్పవచ్చు. కరివేపాకులో ఉండే సుగుణాలు చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇది చర్మంపై ఏర్పడే ముడతలు, మచ్చలు, చర్మపు ఇన్ ఫెక్షన్లను నివారించడంలో అమోఘంగా పని చేస్తుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతూ వృద్దాప్య చాయలను దరి చేరకుండా చేస్తుంది.

Related posts

జుట్టు రాలే సమస్యలకు ఖర్జూరంతో చెక్!

ashok p

మెంతులు మధుమేహాన్ని నియంత్రిస్తాయా? ప్రయోజనాలేమిటీ?

Manaaksharam

జీవక్రియల జోరుకు నిద్ర

ashok p