Mana Aksharam
  • Home
  • Health
  • కాఫీతో ఇన్ని సమస్యలా?
Health

కాఫీతో ఇన్ని సమస్యలా?

side effects of hot coffee

వేడి వేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయం అయిపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదంతా కాఫీలోని కెఫీన్‌ మహాత్మ్యమే. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు వస్తుంది. అయితే దీంతో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. కాఫీతో మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో ఉప్పు, నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోయి ఒంట్లో నీటిశాతం తగ్గే (డీహైడ్రేషన్‌) ప్రమాదముంది. అలాగే ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారూ మితం పాటించటం మంచిది. కెఫీన్‌ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది ఛాతీలో మంట, పులితేన్పుల వంటి సమస్యలకు దారితీయొచ్చు. కెఫీన్‌ రక్తపోటు పెరిగేలా చేస్తుంది కాబట్టి హైబీపీ బాధితులు కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు. అంతేకాదు.. మనం తిన్న ఆహారంలోని క్యాల్షియంను శరీరం గ్రహించుకునే ప్రక్రియకు కెఫీన్‌ అడ్డుతగులుతుందని గుర్తించాలి. కాఫీ తాగిన గంటలోపు రక్తంలో కెఫీన్‌ స్థాయులు తారస్థాయికి చేరుకుంటాయి. దీని ప్రభావం 4-6 గంటల వరకూ కనబడుతుంది! అందువల్ల నిద్రలేమితో బాధపడేవారు సాయంత్రం పూట కాఫీ తాగకపోవటం ఉత్తమం.

Related posts

పరగడుపున వెల్లుల్లిని తింటే..

ashok p

కంటి నిండా నిద్ర కోసం ఈ చిన్న నియమాలను పాటించండి

Harika

పురుషులతో పోలిస్తే మహిళలకు పోషక అవసరాలు ఎక్కువా?

ashok p