Mana Aksharam
  • Home
  • Health
  • కొబ్బరితో ఆరోగ్య ప్రయోజనాలు
Health

కొబ్బరితో ఆరోగ్య ప్రయోజనాలు

cocunut health benefits

సాధారణంగా ప్రతిఒక్కరు పచ్చి కొబ్బరి, ఎండుకొబ్బరి రెండింటినీ ఆహార పదార్థాలలో వాడుతారు. కొబ్బరి వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే కొబ్బరిని అధిక మోతాదులో తీసుకున్న పలు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అదికంగా కొబ్బరి తింటే దగ్గు, నెమ్ము ఆయాసాలు వస్తాయి. కానీ కొబ్బరి వలన ఆరోగ్యానికి అంతకు మంచి చేసే ప్రయోజనాలున్నాయి. మూత్రకోశ సంబంద వ్యాధులు ఉన్నవారికి కొబ్బరి ఎంతగానో మేలు చేస్తుంది. శరీర వేడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా కొబ్బరి వీర్యవృద్ధిని, శృంగార సామర్ధ్యాన్ని సైతం పెంచుతుంది. గుండె సంబంద వ్యాధులు ఉన్నవారికి కూడా ఎంతగానో కొబ్బరి చక్కగా పని చేస్తుంది. శరీరదృడత్వాన్ని పెంచుతుంది. చలువ చేసి, వేడినీ తగ్గిస్తుంది. వాతాన్ని తగ్గించడంలో కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది. గర్భిణీ స్త్రీలు వారానికి 2, గానీ 3 రోజులు గానీ 3 ఔన్సుల కొబ్బరి కల్లును తాగితే పుట్టే పిల్లలు ఎర్రగా, తెల్లగా జన్మిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వేడి శరీరం ఉన్నవారి నరాలకు బలం చేకూరుతుంది. ఆకలిని పెంచుతుంది. దాహాన్ని తగ్గిస్తుంది. భుజించిన ఆహారం కూడా సులభంగా జీర్ణం అవుతుంది. ఎండు కొబ్బరిలో కొంచెం పంచదార కలిపి తింటుంటే ప్రేగులలోనున్న కురుపులు తగుముఖం పడుతాయి. మీగడలాంటి లేత కొబ్బరిని ప్రతిరోజూ ముఖంపైన వేసి మర్దన చేసుకుంటే మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడుతాయి. లేత కొబ్బరి, అరటిపండు, పాలు కలిపి ప్రతిరోజూ చిన్నపిల్లలకు తినిపిస్తే వారికి సరైన పోషకాలు ప్రోటిన్స్ అంది శరీర ద్రుదత్వాన్ని పెంచుతుంది. కొబ్బరిపాలు, బొప్పాయి పాలలో కాస్త తేనె కలుపుకొని ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక స్పూను తింటుంటే దగ్గు, విరేచనాలు నుండి విముక్తి కలుగుతుంది. ఉదయం పూట ఒక గ్లాసు కొబ్బరి పాలు తాగి, మరో నాలుగు గంటల తరువాత ఒక చెంచాడు ఆముదం త్రాగితే కడుపులో నున్న బద్దెపురుగులు నశించిపోతాయి.
మలబద్దక సమస్యను కూడా తగ్గిస్తుంది. మూత్ర సంచిలోని వాతమును నొప్పిని తగ్గించటంలో కొబ్బరి దోహదపడుతుంది. కాక పెట్టడం, బొడ్డు సెగ చేయుట వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. లేత కొబ్బరి కాయలోని నీరు వాంతిని, పైత్యం వంటి సమస్యలను తొలగిస్తుంది. శరీరంలో ఉండే క్రిములతో పోరాడి వాటి నుండి కాపాడుతుంది. ముదిరిన కొబ్బరికాయ నీరు దగ్గు, కళ్ళెను పెంచుతుంది. క్రమం తప్పకుండా వారానికి కనీశం మూడు నుండి నాలుగు రోజులైన కొబ్బరిని తీని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Related posts

ఒత్తిడిని తగ్గించే సరైన మార్గం ధ్యానం..!

ashok p

రాగి జావ తాగేయండి చక్కగా..

ashok p

రోజు గుడ్డెందుకు తినాలి..!!

Harika