Mana Aksharam
  • Home
  • News
  • క్రికెట్ బ్యాట్ తో భార్యని చంపి పోలీసులకి లొంగిపోయాడు
Crime News Telangana

క్రికెట్ బ్యాట్ తో భార్యని చంపి పోలీసులకి లొంగిపోయాడు

crime news

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని పత్తిపాకలో దారుణం చోటుచేసుకుంది. భార్యను క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ దేశాయిపేట ఎంహెచ్‌ నగర్‌కు సునీత, లంక రాము 11 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక ఆడ పిల్ల ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాము క్రికెట్‌ బ్యాట్‌తో సునీత తలపై కొట్టి హత్య చేసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పట్టణ సీఐ రవికుమార్‌, ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృత దేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.

Related posts

కేంద్రంపై చంద్రబాబు భగ్గు!

Masteradmin

జియో కొత్త ఆఫర్ కళాశాలలకు ఉచిత వైఫై!

admin

సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

admin