Mana Aksharam
  • Home
  • Spirituality
  • గడపకి పసుపెందుకు రాస్తారో తెలుసా?
Spirituality

గడపకి పసుపెందుకు రాస్తారో తెలుసా?

why turmeric should be applied for main door

సాధారణంగా ఒక ఊరిలో జనాభా గురించి తెలుసుకోవలసి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఎన్ని గడపలు వున్నాయనే ప్రస్తావన రావడం మనం తరచుగా చూస్తూనే వుంటాం,అంటే గడపలేని ఇల్లు ఉండదని మనకి ఈ విషయం తెలియజేస్తుంది.
మన పూర్వీకులు భూమికి … ఆకాశానికి మధ్య హద్దుగా గడపను భావించారు. భూమికి …ఆకాశానికి మధ్య అన్నట్టుగా గడపపై కూర్చుని హిరణ్య కశిపుడిని నరసింహ స్వామి సంహరించిన విషయం కూడా మనకు తెలిసిందే.

గడప శ్రీ మహాలక్ష్మీ స్థానం … అందుకనే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండటం మనకు అనాదిగా ఆచారంగా వస్తోంది. ఇక ఈ పని చేయకుండా ఏ ఇంట్లో ఏ శుభకార్యం గానీ, పూజా కార్యక్రమంగాని జరగదు.

గడపను అమ్మవారి స్థానంగా భావిస్తోన్న కారణంగానే గడపను తొక్కడాన్ని … గడపపై నిలబడి తుమ్మడాన్ని తప్పుగా భావిస్తుంటారు. గడపకి పసుపు రాయడం వెనుక గల కారణాల్లో ఒకటి పవిత్రత అయితే … రెండవది ప్రాణరక్షణ అని చెప్ప వచ్చు.

సాధారణంగా పల్లెటూళ్లు పంటపొలాల మధ్యలోనో … అడవులకు సమీపంలోనో ఇల్లు ఉంటూ వుంటాయి. ఈ కారణంగా ఇళ్లలోకి పాములు … తేళ్లు వంటి విష జంతువులు వస్తూ వుంటాయి. ఇవి పసుపు ఘాటును భరించలేవు కనుక ఆ దరిదాపుల్లోకి రాలేవు.

Related posts

రథసప్తమి రోజు పూజ ఎలా చేయాలి?

Masteradmin

ఆలయాలలో స్త్రీలు పూజలు చేయకూడదా.. ఎందుకు..?

Masteradmin

గోదానం చేస్తే మంచిదంటారు ఎందుకో తెలుసా?

admin