Mana Aksharam
  • Home
  • Breaking
  • గురజాల నుండి జగన్ ఎన్నికల ప్రచారం
Andhra Breaking Headlines Homepage-Slider National News Politics

గురజాల నుండి జగన్ ఎన్నికల ప్రచారం

ఈరోజు విడుదల చేయాల్సిన వైసిపి అభ్యర్థుల జాబితా ఈ నెల 16కు వాయిదా పడింది. ముహూర్తం దాటిపోవడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు. ఇడుపులపాయ వేదికగా ఈనెల 16 వ తేదీన 76 మంది సభ్యులతో కూడిన వైసిపి తొలిజాబితా విడుదలకానుంది. ఈనెల 16 వ తేదీ ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ కు నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 10.26 గంటలకు అభ్యర్థుల తొలి జాబితాను జగన్ విడుదల చేయనున్నారు. అదే రోజు హెలికాఫ్టర్ ద్వారా గుంటూరు జిల్లా గురజాల చేరుకుంటారు. గురజాల నుండి ఎన్నికల ప్రచారాన్నీ ప్రారంభిస్తారు. గతంలో వై ఎస్ కూడా గురజాల నుండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి విజయ ఢంకా మోగించారు. అదే సెంటిమెంట్ గా ఇప్పుడు జగన్ కూడా తన తండ్రి బాటలోనే గురజాల నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్లుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్
మీడియాకు వెల్లడించారు.

Related posts

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు

ashok p

చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న చిన్నమ్మ!

ashok p

మహానాడులో నేను చెప్పినవన్నీ నిజాలే..

ashok p