Mana Aksharam
  • Home
  • Breaking
  • చంద్రబాబుఇక ని డ్రామాలు ఆపు. అంబటి రాంబాబు.
Andhra Breaking News

చంద్రబాబుఇక ని డ్రామాలు ఆపు. అంబటి రాంబాబు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వింటుంటే ఒక్కింత ఆశ్చర్యం కలుగుతోందని, ఆయన ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎన్నికల్లో అక్రమాలు జరిగితే టీడీపీకి 150 సీట్లు ఎలా వస్తాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంబటి రాంబాబు బుధవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చంద్రబాబు ఓడిపోతున్నారు అని తెలిసే రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నువ్వు తాత్కాలిక సీఎంగా ఉండి పోలవరంపై ఎలా రివ్యూ చేస్తావ్‌. ఇక కోడెల శివప్రసాదరావు ఇనిమెట్ల బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని రిగ్గింగ్‌కు ప్రయత్నించారు. కోడెలపై ఫిర్యాదు చేస్తే నాలుగు రోజుల వరకు పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు. పోలీసులు కోడెల శివప్రసాద్ చేతిలో కీలుబొమ్మలా మారారు.
కోడెలకు ఒక పెద్ద క్రిమినల్‌ మైండ్‌.పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఎవరైనా తలుపులు వేసుకుంటారా?. ఆయన రిగ్గింగ్‌కు ప్రయత్నించడంతోనే ఇనిమెట్ల గ్రామస్తులు తిరగబడ‍్డారు. కోడెల 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలే. ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారు. కోడెల నాకంటే కేవలం 928 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చి గెలిచారు. బూత్‌లోకి వెళ్లిన గన్‌మెన్‌లను కూడా వెంటనే సస్పెండ్‌ చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

Related posts

ఎవడబ్బ సొమ్ము?

Masteradmin

ఆప్యాయంగా బాబాయ్.. అబ్బాయిలు!

admin

హైదరాబాద్‌లో చెడ్డీ-బన్నీ గ్యాంగ్!

admin