Mana Aksharam
  • Home
  • Breaking
  • చంద్రబాబు ఇక చాలు నాటకాలు. మంత్రి తలసాని వాఖ్య
Andhra Breaking News Telangana

చంద్రబాబు ఇక చాలు నాటకాలు. మంత్రి తలసాని వాఖ్య

ఆంధ్రప్రదేశ్‌ జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు నాయుడు మరోదారి లేక ఢిల్లీకి పారిపోయి ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి తప్పదని ఈవీఎంలపై చంద్రబాబు దమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. ఐటీ టెక్నాలజీకి కేరాష్‌ అడ్రస్‌ తానేనని చెప్పుకునే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఈవీఎంలపై రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ క్రియాశీలక శక్తిగా మారబోతున్నారన్నారు.

Related posts

బాలకృష్ణ నోటికి కళ్లెం వేయండి : బీజేపీ

admin

కేసీఆర్ గవర్నర్‌తో సమావేశం, ఈ నెల 19న కాబినెట్ విస్తరణ

Masteradmin

ఆ వార్తలో నిజంలో లేదు! : కొండా దంపతులు

admin