Mana Aksharam
  • Home
  • Breaking
  • చంద్రబాబు కు ఓటమి భయం పట్టుకుంది . విష్ణువర్ధన్‌ రెడ్డిఎద్దెవా
Andhra Breaking News Politics

చంద్రబాబు కు ఓటమి భయం పట్టుకుంది . విష్ణువర్ధన్‌ రెడ్డిఎద్దెవా

చంద్రబాబు నాయుడు కు ఓటమి భయం పట్టుకుందని ఈవీఎంలు పనిచేయడంలేదని విషపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియా సమావేశం లో చంద్రబాబు నాయుడు చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు.ఒడి పోతానన్న భయంతో తన దుకాణాన్ని అమరావతి నుంచి ఢిల్లీకి మార్చి ఈవీఎంల పేరుతో కొత్త డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. ఆంధ్రలో చెల్లని రూపాయి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలా చెల్లుతుందుని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఓటు వేసి వచ్చాక గంట, రెండు గంటల్లోనే 30 శాతం ఈవీఎంలు పని చెయలేదని అసత్యపు ప్రచారం చేశారని మండిపడ్డారు. టీడీపీ కి ఓటేస్తే బీజేపీ కి పడుతుంది అంటున్న చంద్రబాబు.. ఒకవేళ తమ పార్టీకి ఓట్లు రాకపోతే ఈవీఎంలను మేనేజ్ చేసినట్లు చంద్రబాబు ఒప్పకుంటారా అని సవాల్‌ చేశారు. రూ.5 కోట్లు ఇస్తే ఈవీఎంలు మేనేజ్ చేస్తామని కొందరు తన వద్దకు వచ్చారని చం‍ద్రబాబు చెబుతున్నారు.. అంటే ఆయన కార్యాలయం ఏమైనా దొంగలకు అడ్డనో చంద్రబాబు చెప్పాలన్నారు.

Related posts

విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. విద్యార్థినిపై!

admin

కాంగ్రెస్ లో చేరిన బండ్ల గణేష్!

admin

ఆ ఐదుగురికి జనసేన టికెట్లు కన్ఫర్మ్!

admin