Mana Aksharam
  • Home
  • Breaking
  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పనబాక దంపతులు
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పనబాక దంపతులు

కొన్నేళ్లుగా తిరుపతి ఎంపీ సీటును దక్కించుకోవడంలో విజయవంతం కాలేకపోతున్న టీడీపీ… ఈ సారి కచ్చితంగా ఈ సీటును దక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇందుకోసం బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావించిన చంద్రబాబు… మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు పనబాక లక్ష్మీకి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. తన భర్త కృష్ణయ్యతో కలిసి టీడీపీలో చేరిన పనబాక లక్ష్మీ… తిరుపతి ఎంపీగా పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టే అని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలోనే ఆమె పేరు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాంగ్రెస్ తరపున నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికైన పనబాక… తిరుపతి నుంచి మాత్రం పోటీ చేయలేదు. గతంలో బాపట్ల, నెల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించిన పనబాక లక్ష్మీ… కేంద్రంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తరువాత కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ వచ్చిన పనబాక లక్ష్మీ… ఎంపీ టికెట్‌పై టీడీపీ నుంచి స్పష్టమైన హామీ రావడం వల్లే టీడీపీలో చేరినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ సీటుగా ఉన్న తిరుపతి లోక్ సభ స్థానం నుంచి ఈ సారి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ సిట్టింగ్ ఎంపీ వరప్రసాద్‌ను ఈ సారి గూడూరు ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపీగా జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు ? పనబాక లక్ష్మీ ద్వారా తిరుపతి ఎంపీ స్థానం దక్కించుకోవాలనుకుంటున్న చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Related posts

రూటు మార్చిన జగన్!!

ashok p

‘ఎమ్మెల్యేల అనర్హత’పై రాష్ట్రపతిని కలవనున్న ఆప్ ఎమ్మెల్యేలు

ashok p