Mana Aksharam
  • Home
  • News
  • Andhra
  • చచ్చిపోతావ్..వైసీపీ నేత విజ‌య‌సాయికి బెదిరింపు కాల్స్‌
Andhra News Politics

చచ్చిపోతావ్..వైసీపీ నేత విజ‌య‌సాయికి బెదిరింపు కాల్స్‌

ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ చేస్తున్న అరాచకాలను మొద‌టి నుంచి వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఘాటుగా కౌంట‌ర్ ఇస్తున్నారు. ఇంటా , బయట ఇటు చంద్ర బాబు ను లోకేష్ కు సోష‌ల్ మీడియా ద్వారా ఇద్ద‌రికి నిద్ర‌లేకుండా చేస్తున్నారు. ఇద‌లా ఉంటె విజ‌య‌సాయిరెడ్డికి బెదిపింపు ఫోన్ కాల్స్ రావ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. 618729089, 9538362525, 8247662578, 8886059309 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సమాచారం.టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని హెచ్చరికలు జారీచేస్తూ కొద్ది రోజులుగా ఆగంతకులు తనకు పదే పదే కాల్స్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. మొదట వాటిని అంతగా పట్టించుకోనప్పటికీ తాను మీటింగుల్లో ఉన్న ప్రతీసారి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురిచేశారని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను పలువురు అధికార పార్టీ నేతలు తనను చంపుతామంటూ హెచ్చరించారని పేర్కొన్నారు.బెదిరింపు ఫోన్ కాల్స్ నేపథ్యంలో హైకోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సూచనల మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మృత్యువుతో పోరాడిన రవళి ఇక లేదు..

Manaaksharam

సాక్షాత్తు సీఎంకే తెలియకపోతే ఎలా?

admin

లోకేష్ కి వైసీపీ వింత సవాల్!

admin