Mana Aksharam
  • Home
  • Health
  • చర్మం కాంతివంతంగా మెరవాలి అంటే కరివేపాకు రసం తాగండి
Health

చర్మం కాంతివంతంగా మెరవాలి అంటే కరివేపాకు రసం తాగండి

కూరల్లో కరివేపాకు కనిపిస్తే చాలు తీసిపారేయడం చేస్తుంటారు. తాలింపుల్లో వేసి ఆ తర్వాత తీసివేయటం సుదీర్ఘకాలంగా వస్తున్న ఆనవాయితీ. కరివేపాకు పలురకాల వైద్యంలో దివ్యఔషధంగా పనిచేస్తుందని, తీసిపారేయకుండా తినడం మంచిదని ఇటీవల వైద్యనిపుణులు చెబుతున్నారు. అనేక ప్రయోజనాలు గల కరివేపాకు గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. మీ జుట్టు ముందుగానే తెల్లబడిపోతోందా! అయితే కరివేపాకు కల్పించే అద్భుత ప్రయోజనాలు తెలుసుకోవలసిందే.

ఆరోగ్యకరమైన, నిగనిగలాడే జుట్టుకోసం కరివేపాకుల రసం, తులసి, పెద్ద బంతిపూలు, గూస్‌బెర్రీతో కలిపి బాగా మరిగించాలి. అనంతరం దాన్ని వెంట్రుకలకు బాగా రాసి కొద్దిసేపు అయ్యాక వెంట్రుకలు శుభ్రం చేసుకోవాలి. నీ జుట్టు, నల్లగా, ఒత్తుగా పెరగడానికి కరివేపాకు పేస్టు ఉసిరిపొడి కలిపి తలకు ఇరవై నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇంగ్లీషులో కర్రీలీవ్స్‌ (స్వీట్‌నీమ్‌ లీవ్స్‌), హిందీలో కదిపట్ట అని పిలిచే కరివే పాకు సువాసనకు, పరిమళానికి ప్రసిద్ధి.

వంటల్లో తప్పనిసరిగా కరివేపాకు ఉపయో గిస్తారు. ప్రత్యేకించి దక్షిణ భారతదేశం, శ్రీలంకలో వంటకాలలో కరివేపాకును విరివిగా వాడతారు. భారతదేశమే కరివేపాకు పుట్టినిల్లు. ఆయుర్వేద ఔషధాల తయారీలో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తారు. మధుమేహం, పైల్స్‌, బొల్లి, చర్మ దురదలు, ఎర్రటి మొటిమలు, గ్యాస్‌, మలబద్దకం, డయేరియా, వాంతులు, లాంటి రుగ్మతల చిక్సితకు కరివేపాకు ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. తలవెంట్రుకలకు కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది.

ప్రత్యేకించి ముందుగానే జుట్టు తెల్లబడుతున్నా, రోజుకు ఒక డజను వెంట్రుకలు ఊడిపోతున్నా దీని పరిష్కారానికి ఎంతో బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. శరీరంలో అధికవేడి ఉన్నట్లయితే వెంట్రుకలకు సరఫరా అయ్యే పోషకాలు త్వరగా హరించుకునిపోతాయని, అందువల్ల వేడిమూలంగా త్వరగా వెంట్రుకలు తెల్లబడ తాయని తెలిపారు. వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోయినా, ముందుగా జుట్టు తెల్లగా అవ్ఞతున్నా అర్థం చేసుకుని మంచి పోషకాలు తీసుకోవడం, వేడితగ్గే పదార్థాలు వాడడం అవసరం.

అధిక వేడివల్లనే వాస్తవంగా త్వరగా బట్టతల, తలపై దురదలు, చుండ్రు లాంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని నివారించడానికి ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఏడెనిమిది కరివేపాకులు నమిలి తినాలని, ఆ తర్వాతనే మంచినీళ్లు తాగాలని వారు సూచిస్తున్నారు. కరివేపాకు వగరుగా ఉండటం వల్ల వేడి తగ్గిపో తుంది. కరివేపాకులను పుదీన, కొత్తిమీర, ఉసిరితో కలిపి పచ్చడి చేసుకోవచ్చు. అందులో రుచికోసం కాస్త ఉప్పు వేయవచ్చు.

కొబ్బరి నూనె లేదా నువ్ఞ్వల నూనెలో కరివేపాకులు వేసి కాచి చల్లార్చి తలకు రాసుకుంటే నలుపు రంగు రావడానికి, జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. అందులో కాస్త నిమ్మరసం కూడా కలపాలి. చుండ్రు తగ్గడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పది రకాల మూలికలు, కరివేపాకు, భృంగరాజ్‌తో కలిపి జీవ హెయిర్‌ ఆయిల్‌ తయారుచేస్తున్నారు. వెంట్రుకల కుదుళ్లు బలపడ డానికి కరివేపాకులు బాగా ఉపయోగపడతాయి. కొత్తగా వెంట్రుకల కుదుళ్లు ఏర్పడి, ఆరోగ్యకరంగా పెరిగి జుట్టు సాధారణంగా తయారవ్ఞ తుందని నిపుణులు అంటున్నారు.

జీర్ణవ్యవస్థే కీలకం ఆయుర్వేద చికిత్సా విధానంలో ముందుగా రోగి ముఖం పరీక్షించి గాకుండా జీర్ణాశయం పరిస్థితిని బట్టి చికిత్సచేస్తారని నిపుణులు తెలిపారు. ప్రతి ఆరోగ్య సమస్యా ముందుగా జీర్ణాశయం పనివిధానంలో తేడా రావడం వల్ల ప్రారంభ మవ్ఞతుంది. జీర్ణాశయాన్ని శుభ్రం చేసి తిరిగి చక్కగా పనిచేయించడంలో కరివేపాకు ఉపయోగపడుతుందని రుజువైంది. అలాగే జీర్ణవ్యవస్థ కూడా పటిష్టమవ్ఞతుంది.

మజ్జిగ లేదా తేనెతో కలిపి కరివేపాకు పేస్ట్‌ను ఇస్తామని, దానివల్ల జీర్ణకోశం శుభ్రపడి, మొత్తం వ్యవస్థ పటిష్ఠమవ్ఞతుందని త్వరగా రోగికి పూర్తి స్వస్థతగల చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. కరివేపాకును కొబ్బరినూనె, మేథితో కలిపి తలవెంట్రుకలు రాసినట్లయితే చుండ్రు అదుపులో ఉండి, జుట్టు పెరుగుతుంది. కరివేపాకులు రుచిగా ఉండవనుకుని ఆహారంలోంచి తీసివేయకూడదు. వాటిని వదిలిపెట్టకుండా తినడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.

Related posts

ఒకరకంగా పిల్లలకు ఈ అలవాటు మంచిదే ఎందుకో తెలుసా??

ashok p

టిఫిన్‌ మానేయకండి అయిపోతారు..

ashok p

తమలపాకులను ముద్దగా నూరి తలకు పట్టిస్తే..

Manaaksharam