Mana Aksharam
  • Home
  • Recipes
  • చికెన్ సమోసా తయారీ
Recipes

చికెన్ సమోసా తయారీ

chicken samosa receipe in telugu

కావల్సిన పదార్థాలు:

చికెన్‌ (కీమా) – 1 కప్పు (లేదా) అవసరాన్ని బట్టి పరిమాణం పెంచుకోవచ్చు ,కారం పొడి- 2 స్పూన్లు, గరం మసాల – స్పూను , పసుపు – అర స్పూను, సోంపు పౌడర్‌ – స్పూను , ఉప్పు – తగినంత , మిరియాల పొడి – అరస్పూను , ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి) , నూనె – వేయించడానికి సరిపడా , అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ – 2 స్పూన్లు, పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి) , గుడ్డు – 1 , గోధుమపిండి – కప్పు , మైదాపిండి – 2 కప్పులు , ధనియాల పొడి – 2 స్పూన్లు , నిమ్మకాయ -1 , నీళ్లు – సరిపడా , కొత్తిమీర – కొద్దిగా..

తయారీ విధానం:

  • ముందుగా కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్‌ మిన్స్‌ను (సన్నగా తరిగిన చికెన్ లేదా చికెన్ కీమా) జోడించాలి. తర్వాత అందులోనే సోంపు పౌడర్‌, మిరియాలు, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని కలపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో.. గోధుమ పిండి, మైదాపిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా కలిపి 15 నిమషాలు అలాగే పెట్టాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్నచిన్న చపాతీల మాదిరిగా చేసుకోవాలి. వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న చికెన్‌ మిశ్రమాన్ని నింపి.. సమోసాల మాదిరిగా ఒత్తుకోవాలి. అదనపు రుచికోసం మిశ్రమంలో నిమ్మరసం, కొత్తిమీర వేసుకోవచ్చు.
    ఈ విధంగా తయారుచేసుకున్న సమోసాలను.. నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి . తర్వాత తీసిన సమోసాలను వేడి వేడిగా సాస్‌తో కలిపి తింటే.. అదిరిపోద్ది సుమీ..

Related posts

అంజీర్ హల్వా తయారీ

ashok p

చిల్లీ పన్నీర్… తయారీ

ashok p

పుదీనా పప్పు తయారీ.!!

Harika