Mana Aksharam
  • Home
  • News
  • చిగురుపాటి జయరామ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
Breaking Crime Headlines Homepage-Slider News Top Read Stories

చిగురుపాటి జయరామ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

చిగురుపాటి జయరామ్ కేసులో

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రౌడీ షీటర్ నగేష్ తోపాటు విశాల్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించనున్నారు.

జయరామ్ హత్య కేసులో వీరిద్దరి ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. విశాల్ జయరామ్ ను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

జయరామ్ హత్య జరిగిన రాత్రి సంతోష్ రావుతో కారులో లాంగ్ డ్రైవ్ వెళ్లినట్లు శిఖా చౌదరి పోలీసులకు తెలిపింది. దీంతో సంతోష్ రావును పోలీసులు విచారిస్తున్నారు.

హత్య జరిగిన రోజు సంతోష్ రావు, శిఖా చౌదరితో కలిసి ఎక్కడెక్కడికి వెళ్లారనే విషయాలను పోలీసులు సేకరిస్తున్నారు.

మరోవైపు జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డికి సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, రాంబాబు జూబ్లీహిల్స్‌ పోలీసులకు బుధవారం వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.

అనంతరం వారిని బంజారాహిల్స్‌ పోలీస్‌ ఠాణాలో దర్యాప్తు అధికారులు 4 గంటల పాటు విచారించారు.

Related posts

బాబు, లోకేష్ లే హత్యకు సూత్రదారులు… విజయసాయి రెడ్డి

Harika

చెట్లు నాటేవారికి ‘వృక్షమిత్ర’ అవార్డులు

ashok p

అమిత్ షా వచ్చి కూర్చోవాలి: కంచ ఐలయ్య

Manaaksharam