Mana Aksharam
Entertainment

చిత్రలహరి విశేషాలు..!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు . నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికలుగా కళ్యాణి ప్రియదర్శన్‌, నివేథ పెతురాజ్‌లు నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇందులో మొదటి పాత్ర ( నివేథ పెతురాజ్‌), రెండో పాత్ర ( కళ్యాణి ప్రియదర్శన్‌), మూడో పాత్ర ( సునీల్‌), అసలు పాత్ర ( సాయిధరమ్ తేజ్‌) అంటూ పాత్రలని పరిచయం చేశారు. వీరు చెప్పే డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్‌ని బట్టి చూస్తుంటే మూవీ మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అర్ధమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చుతున్నారు. సునీల్ ఈ చిత్రంలో కమెడీయన్‌గా అలరించనున్నాడు. తాజాగా కళ్యాణి ప్రియదర్శిని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ తో పాటు డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. తొలి సినిమాగా ‘హలో’ మూవీలో అఖిల్ సరసన నటించి ఆకట్టుకున్న కళ్యాణి ప్రియదర్శిని, తన రెండో సినిమా సాయి ధరమ్ తేజ్ సరసన ‘చిత్రలహరి’లో నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. చూద్దాం మరి ఈ సినిమాతో ఐన తేజ్ హిట్ కొడతాడేమో..

Related posts

సిట్‌ విచారణకు హాజరైన తనీష్‌

ashok p

జాగ్రత్త పడ్తున్న విజయ్ దేవరకొండ..!!

Harika

‘లక్ష్మీ’ మూవీ రివ్యూ & రేటింగ్

ashok p