Mana Aksharam
  • Home
  • Entertainment
  • చిన్మయికి డైరెక్ట్ వార్నింగ్
Entertainment

చిన్మయికి డైరెక్ట్ వార్నింగ్

తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై అలుపెరగని పోరాటం చేస్తోంది గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి శ్రీపాద. తనతో పాటు చాలామంది అమ్మాయిల్ని వైరముత్తు లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపిస్తే ఇప్పటిదాకా ఆయనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోగా చిన్మయిని ఏదో కారణం చూపించి తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి వెలి వేశారు.

ఇది చాలదన్నట్లు ఆమెను అనేక రకాలుగా బెదిరించి, వేధించే ప్రయత్నాలు జోరుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైరముత్తు శిష్యుడైన రాజన్ అనే నిర్మాత.. ఒక సినిమాకు సంబంధించిన వేడుకలో దారుణమైన విమర్శలు గుప్పించాడు. చిన్మయి కెరీర్‌ను నాశనం చేస్తా అంటూ ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం కొసమెరుపు.

వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఎప్పుడైనా ఆయన తన కంటపడితే చెంప చెళ్లుమనిపిస్తానని చిన్మయి ఇటీవల వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావించిన ప్రొడ్యూసర్ రాజన్.. చిన్మయి చీప్‌ పబ్లిసిటీ కోసం తన గురువు వైరముత్తుపై తప్పుడు దూషణలు చేస్తోందని, ఆమె కెరీర్‌ను నాశనం చేస్తానని బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

మిగితావాళ్లంతా మౌనంగా ఉండిపోగా దర్శకుడు పా.రంజిత్ మాత్రం రాజన్ వ్యాఖ్యల్ని అక్కడిక్కడే ఎండగట్టారు. పరిశ్రమలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి నిందితులకు సరైన బుద్ధి చెప్పాలని అన్న రంజిత్.. ఇలాంటి కేసులు ఎవరి దృష్టికైనా వస్తే క్షేత్రస్థాయిలో దర్యాప్తు చెప్పటాలి కానీ ఇలాంటివి బయటపెట్టినందుకు వారిని బెదిరించకూడదని అంటూ రాజన్‌కు పరోక్షంగా చురకలంటించాడు. ఇక తమిళ ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువైనప్పటికీ తెలుగులో మంచి పాటలతో దూసుకుపోతుంది చిన్మయి.. టాలెంట్ ఉంటె ఎక్కడైనా బ్రతకొచ్చు అని నిరూపిస్తోంది చిన్మయి..

Related posts

జక్కన్న తర్వాతి సినిమాపై క్లారిటీ…

Masteradmin

పబ్లిక్‌లో ఈ ముద్దులేంటి సుబ్బారావ్?

Masteradmin

చై-సామ్‌ సినిమా షురూ

admin