Mana Aksharam
  • Home
  • News
  • Andhra
  • ‘చెమటలు పడుతున్నాయ్..ఫ్యాన్ వేస్కోండి’..చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

‘చెమటలు పడుతున్నాయ్..ఫ్యాన్ వేస్కోండి’..చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్

'చెమటలు పడుతున్నాయ్..ఫ్యాన్ వేస్కోండి'..చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు నేతలు జంపింగ్‌లు..మరోవైపు విమర్శల తాటాలతో రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ఫిర్యాదు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టార్గెట్‌గా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 

ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ ఎన్నికల గుర్తు సీలింగ్‌ ఫ్యాన్‌ తొలిగించాలని ఎన్నికల అధికారులకు టీడీపీ ఫిర్యాదు చేయడంపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ ఫ్యాన్ గుర్తును చూస్తే చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయమంటూ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు.

అటు టీడీపీలో చేరికలపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము వద్దనుకున్న నేతలే పసుపు పార్టీలో చేరుతున్నారంటూ ఎద్దేవా చేశారు. గాలి విసిరికొట్టినప్పుడు తాటు గింజలు కొట్టుకొస్తాయని…దానికే మురిసిపోతే ఎలా? అని అన్నారు. అవి తినడానికి పనికిరావని…మొలకెత్తవని చురకలంటించారు. ఓటమి భయంతో చంద్రబాబునాయుడు వణికిపోతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Related posts

శ్రీదేవి గుండెపోటుతో చనిపోలేదు! : ఫోరెన్సిక్‌ రిపోర్ట్

ashok p

కన్నీటి పర్యంతమైన కేసీఆర్ ..

ashok p

రైనాకు ఛాన్స్‌.. యువీకి మొండిచేయి!

Manaaksharam