Mana Aksharam
  • Home
  • News
  • చేతబడి చేస్తునాడనుకొని చంపేశారు
Andhra Crime News

చేతబడి చేస్తునాడనుకొని చంపేశారు

latest crime news

చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఓ గుర్తు తెలియని వ్యక్తిపై కొందరు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో అతను దుర్మరణం చెందాడు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామం సమీపంలోని సత్తెమ్మ తల్లి గుడి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…సుమారు 30 సంవత్సరాల వయసున్న మతి స్థిమితం లేని ఓ వ్యక్తి మెడలో రుద్రాక్షలు వేసుకొని రెండు మూడు రోజులుగా సత్తెమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. సోమవారం రాత్రి గుడికి అనుబంధంగా ఉన్న వంట గది వద్ద బొప్పాయి, మామిడి ముక్కలతో పాటు కోడి తలకాయలతో ఆ వ్యక్తి వంట చేసుకుంటున్నాడు. అడవికి వెళ్తున్న కొందరు ఏం చేస్తున్నావంటూ ఆ వ్యక్తిని ప్రశ్నించారు. భాష రాని అతడు బదులివ్వకపోవడంతో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో రాళ్లు, కర్రలతో గట్టిగ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు.

వారు వచ్చి 108కి ఫోన్‌ చేశారు. సిబ్బంది వచ్చి ఆ వ్యక్తి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సంఘటన స్థలాన్ని మంగళవారం నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు, మైలవరం సీఐ నాగేశ్వరరావు పరిశీలించారు.

Related posts

కాంగ్రెస్‌ నేత దారుణహత్య..

admin

విజయవాడలో ఓటేసిన జనసేనాని

Manaaksharam

ఆ వీడియోలో ఉంది నిత్యానందే..

admin