Mana Aksharam
  • Home
  • Breaking
  • జబర్దస్త్ షోను మాత్రం వదిలే ప్ర‌స‌క్తి లేద‌ని తేల్చి చెప్పిన నాగబాబు.
Andhra Breaking News Telangana

జబర్దస్త్ షోను మాత్రం వదిలే ప్ర‌స‌క్తి లేద‌ని తేల్చి చెప్పిన నాగబాబు.

‘జబర్దస్త్’ షో ఈ పేరు చెప్పగానే నాగ‌బాబు పేరు మొద‌టిగా గుర్తుకు వ‌చ్చేది . . గ‌త ఆరు సంవ‌త్స‌రాలుగా ప్ర‌సార‌మ‌వుతున్న ‘జబర్దస్త్’ ప్రొగ్రామ్‌కు జ‌డ్జీగా వ్య‌వ‌హారిస్తున్నాడు నాగ‌బాబు. ఆయ‌న‌తో పాటు న‌టి, వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హారిస్తున్నారు. అయితే గ‌త రెండు , మూడు వారాలుగా వీరు జబర్దస్త్ షోకు హాజరు కావడం లేదు. రోజా వైసీపీ పార్టీ త‌రుపున న‌గ‌రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె ఎన్నిక‌ల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల జబర్దస్త్ షోకి రాలేక‌పోయారు. ఇక నాగ‌బాబు కూడా త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ నుంచి ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీ చేశారు. ఈయ‌న కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఈ షోకి రాలేక‌పోయారు. నాగ‌బాబు న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేశారు. ఎన్నిక‌లు పూర్తి కావ‌డంతో అభ్య‌ర్ధులు అంద‌రు కాస్తా రిలాక్స్ అవుతున్నారు.తాజాగా నాగ‌బాబు త‌న యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతు… తాను గెలిచిన , ఓడిన జబర్దస్త్ షో మాత్రం వదిలే ప్ర‌స‌క్తి లేద‌ని తెలిపారు.నెలకి నాలుగైదు రోజు షో కోసం సమయం కేటాయిస్తే సరిపోతుందని, దాని కారణంగా తన రాజకీయ జీవితానికి ఎలాంటి అడ్డంకి ఉండదని అన్నారు. జబర్దస్త్ షోను మాత్రం వదిలే ప్ర‌స‌క్తి లేద‌ని తేల్చి చెప్పిన నాగబాబు

Related posts

మొదలైన ‘పెథాయ్‌’ తుఫాను ప్రభావం !

Manaaksharam

పంచాయతీపై…ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు

Masteradmin

మద్యం ప్రియులు బార్లు!

admin