Mana Aksharam
  • Home
  • Spirituality
  • జాతకం లోరాహువు అనుకూలంగా ఉండాలంటే ?
Spirituality

జాతకం లోరాహువు అనుకూలంగా ఉండాలంటే ?

నవ గ్రహాలలో రాహువు స్త్రీ గ్రహం. ఇది ఛాయా గ్రహమే కాదు అపసవ్య మార్గంలో నడుస్తుంది. అంటే మేషం, తరువాత మీనం ఇలా అపసవ్యంగా రాశులలోకి ప్రవేశిస్తుంది. రాహువు నక్షత్రాలుగా పిలవబడే ఆరుద్ర, స్వాతి, శతభిషం జాతకులకు మొదటి రాహుదశా శేషంతో ప్రారంభంమవుతుంది. రాహు దశకాలం పద్దెనిమిది ఏళ్లు. సాధారణంగా రాహు దశాకాలంలో మనిషి జీవితం అనేక ఒడిదొడుకులకు గురవుతుంది. కాని కొన్ని నక్షత్రాలకు మాత్రం కాస్త వెసులు బాటు ఉంటుంది. రాహువుకు రాశిచక్రంలో స్థానం లేదు. వృషభరాశిలో ఉచ్ఛస్థితి, వృశ్చిక రాశిలో నీచ స్థితిని పొందుతాడు. ఇది పాపగ్రహం. ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. రాహువు సగ భాగం పాము శరీరం ఉంటుంది. కాబట్టి విషంతో అధిక ప్రాముఖ్యత ఉంటుంది. కళాకారుల జీవితంలో రాహువు ప్రధాన పాత్ర పోషిస్తాడని జ్యోతిష పండితులు విశ్వసిస్తారు. రాహువు దోష నివారణకు . నువ్వుల మొక్క ఆకులు, సాంబ్రాణి, కస్తూరి, ఏనుగు దంతం వీటిని నీళ్లలో వేసి స్నానం చేయాలి. రాహు గ్రహాన్ని పూజించడం, దుర్గాదేవి ఆరాధన, గోమేధికం ధరించడం వల్ల ఈ గ్రహ దోష నివారణ జరగుతుంది. గోమేధికం, గుర్రం, నీలవస్త్రం, కంబళి నూనె, మినుములు, పంచలోహాలను దానం చేయడం వల్ల కూడా దోష పరిహారమవుతుంది. గేదె కొమ్ముతో చేసిన పాత్రలో గుగ్గిలం, ఇంగువ, హరిదళం, మనశ్శిలల కలిపిన నీటితో స్నానం చేయాలి. పంచ లోహ ఉంగరం ధరించడం. శుభతిధి గల శనివారం ‘ఓం-భ్రాం-భ్రీం-భ్రౌం-సః రాహవే నమః’ మంత్రాన్ని 40 రోజులలో 18 వేలు జపాలు పూర్తి చేసి, 41వ రోజున మినుములు, వస్త్రంలో చుట్టి దానం చేస్తే రాహు గ్రహ సంబంధ దోషం తొలగిపోతుంది. ‘ఓం అస్య శ్రీ రాహుస్తోత్ర మహామంత్రస్య వామదేవ ఋషిః| అనుష్టుప్చ్ఛందః| రాహుర్దేవతా| శ్రీ రాహు గ్రహ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః| స్త్రోత్రాన్ని ఉచ్చరించాలి.

Related posts

ఆహ్వానం అందలేదని కేఈ అసంతృప్తి

Masteradmin

క్షమే సత్యం.. క్షమే ధర్మం..

admin

అసలైన దుర్గుణం అదే!

admin