Mana Aksharam
  • Home
  • News
  • జ్యోతిని చంపేందుకే పవన్‌కల్యాణ్‌ను సాయం కోరాడుః ఎస్పీ
Breaking Crime News

జ్యోతిని చంపేందుకే పవన్‌కల్యాణ్‌ను సాయం కోరాడుః ఎస్పీ

జ్యోతి చంపేందుకే పవన్‌కల్యాణ్‌ను శ్రీనివాస్‌ సాయం కోరాడుః ఎస్పీ

బలమైన రాడ్డుతో త‌ల‌పైపై చేయడంతో దెబ్బలు తాళలేక జ్యోతి చనిపోయిందని మంగ‌ళ‌గిరి ఎస్పీ విజ‌య‌రామారావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన జ్యోతి హ‌త్య కేసు నిందితుల‌ను పోలీసులు మీడియా ఎదుట ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్భంగా కేసు సంబంధించిన సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. జ్యోతి హ‌త్య త‌ర్వాత నిజాలు దాచిపెట్టేందుకు, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులిద్దరూ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశార‌ని ఎస్పీ చెప్పారు. ఎవరో వచ్చి దాడి చేశారని శ్రీనివాస్‌ కథలు చెప్పారని, దీంతో మొదట దానిపై దృష్టిసారించామని ఎస్పీ తెలిపారు.

ఈ కేసులో ప్ర‌ధాన నిందిత‌డైన జ్యోతి ప్రియుడు శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేశామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. జ్యోతి, శ్రీనివాస్‌కు కొన్నాళ్ల నుంచి స్నేహం ఉందని, అలాగే శ్రీనివాస్‌, కటారి పవన్‌కల్యాణ్, జ్యోతి మధ్య స్నేహం ఉందని తెలిపారు. ఏళ్ల తరబడి స్నేహంతో వాళ్లు మరింత దగ్గరయ్యారని అన్నారు. ఘటన జరిగిన రోజు జ్యోతికి శ్రీనివాస్‌ మెస్సేజ్‌ పెట్టాడని ఎస్పీ తెలిపారు. ఇద్దరి విజువల్స్‌ సీసీ టీవీ ఫుటేజీలో లభించాయన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధన చేశామని, శ్రీనివాస్‌ ఒకరిద్దరి సాయంతో హత్య చేశాడనుకున్నామని ఎస్పీ చెప్పారు. సాక్షి, నిందితుడు ఒకడే కావడంతో విచారణలో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. శ్రీనివాస్‌ ఫోన్‌లో అశ్లీల ఫొటోలు గుర్తించామని, ఫేస్‌బుక్‌లోనూ అసభ్యంగా ప్రవర్తించేవాడని గుర్తించామని పేర్కొన్నారు. శ్రీనివాస్‌ ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్లీ కస్టడీకి తీసుకుంటామని, మళ్లీ విచారించాల్సి ఉందని చెప్పారు. కేసును సరిగా విచారించని వారిపై చర్యలు తీసుకున్నామని ఎస్పీ విజయారావు స్ప‌ష్టం చేశారు.

Related posts

తాగి తొంగునేవారు ప్రజాసేవ చేస్తారా?

Manaaksharam

వ్యూహాత్మకంగా జగన్ అడుగులు!

ashok p

పవన్ కీలక నిర్ణయాలు అప్పుడే!

ashok p