Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • జ‌గ‌న్ పై దాడి కేసులో సంచ‌ల‌న నిర్ణ‌యం..హ‌ర్షిస్తున్న వైసీపీ నేత‌లు
Andhra Crime Homepage-Slider News

జ‌గ‌న్ పై దాడి కేసులో సంచ‌ల‌న నిర్ణ‌యం..హ‌ర్షిస్తున్న వైసీపీ నేత‌లు

జ‌గ‌న్ పై దాడి కేసులో సంచ‌ల‌న నిర్ణ‌యం..హ‌ర్షిస్తున్న వైసీపీ నేత‌లు

విజ‌య‌వాడః వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాస‌రావు అనే యువ‌కుడు హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. ఈ కేసును విజ‌య‌వాడ ఎన్ఐఏ స్పెష‌ల్ కోర్టు విచారిస్తోంది.. ఈ సంద‌ర్భంగా కోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి కేసు విచారణను ఇన్‌ కెమెరా ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఈ కేసు విచార‌ణ స‌మ‌యంలో ధ‌ర్మాస‌నం ఎదుట‌ ఇరుపక్షాల న్యాయవాదులు తప్ప, మరెవ్వరూ ఉండరాదని స్పష్టంచేసింది. అలాగే ఈ విచారణపై ఎలాంటి వార్తలు రాయడంగానీ, ప్రసారం చేయడంగానీ చేయకూడ‌ద‌ని పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వుల మేర‌కు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వెల్ల‌డించింది. కాగా ఇటీవల ఈ కేసులో ఎన్‌ఐఏ చార్జిషీట్‌ దాఖలు చేసింది. అయితే ఈ చార్జిషీట్ కు నెంబర్ కూడా ఇవ్వ‌క‌ముందే ఈ చార్జిషీట్‌ బహిర్గతమైంది.

దీంతో న్యాయమూర్తి ఇన్‌ కెమెరా ప్రొసీడింగ్స్‌ నిర్వహణకు ఆదేశాలిస్తానని గత విచారణ సమయంలోనే సూత్రప్రాయంగా స్ప‌ష్టం చేశారు.

శ్రీనివాస‌రావుకు ముగిసిన క‌స్ట‌డీ.


అటు నిందితుడు శ్రీనివాస‌రావు క‌స్ట‌డీ ముగియడంతో పోలీసులు అత‌న్ని ప్రత్యేక కోర్టు ఎదుట హాజ‌రుప‌ర్చ‌రు. విచార‌ణ ప్రారంభించిన వెంట‌నే న్యాయ మూర్తి .. ఇక‌పై ఈ కేసును ఇన్‌ కెమెరా ద్వారా విచారణ చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు విచారణ వేగవంతం కొర‌కు, అలాగే నిష్పాక్షికంగా విచారణ జరిగేందుకు ఈ ఇన్‌ కెమెరా తోడ్ప‌డ‌తుంద‌ని తెలిపారు. అలాగే, సాక్షులు, నిందితుడు, పీపీలు, న్యాయవాదుల భద్రతపై కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొనారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తరఫు న్యాయవాది మట్టా జయకర్‌ చార్జిషీట్‌లోని అంశాలు పత్రికల్లో వచ్చాయంటూ, వాటి కాపీలను న్యాయమూర్తికి తీసుకొచ్చారు.

ఈ ఉత్తర్వులు జారీచేసిన వెంట‌నే కోర్టు హాలులో ఉన్న కక్షిదారులు, న్యాయ విలేకరులు, ఇతర రిపోర్టర్లు, న్యాయవాదులను బయటకు పంపేశారు.

కోర్టు నిర్ణ‌యంపై వైసీపీ హ‌ర్షం


ఇక కోర్టు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంపై వైసీపీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

కేసు విచార‌ణ‌ను ప‌క్క దారి ప‌ట్టించేందుకు కొంద‌రు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు కోర్టు చెక్ పెట్టింద‌ని , ఈ కేసు దోషులంద‌రికి క‌ఠిన‌ శిక్ష ప‌డాల‌ని కోరారు.

Related posts

భార్యకు ఎలా దొరికిపోయాడు అంటే..!

ashok p

‘మా’ ఎన్నికల ఉత్కంఠ పోరులో నరేష్‌దే గెలుపు

Manaaksharam

ఉగ్రవాదుల్లా రేవంత్ ని ఈడ్చుకెళ్లారు.!!

Harika