Mana Aksharam
  • Home
  • Breaking
  • టి.కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ‘ హాంఫట్ ‘
Andhra Breaking Headlines Homepage-Slider News Politics Telangana

టి.కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ‘ హాంఫట్ ‘

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోనుందా అంటే అందరూ అవుననే అంటున్నారు. రోజురోజుకి కాంగ్రెస్ ఫిరాయింపు దారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మొత్తం 19 మంది సభ్యులున్న కాంగ్రెస్, ఆత్రం సక్కు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య , రెగా కాంతారావు, సబితా రెడ్డి లతో పాటు తాజాగా పాలేరు ఎమ్యెల్యే ఉపేందర్ రెడ్డి కూడా కారెక్కిన నేపథ్యంలో మొత్తం 6మంది సభ్యులు పార్టీ ఫిరాయించినట్లయ్యింది. దీంతో కాంగ్రెస్ సభ్యల సంఖ్య 13 కు పడిపోయింది. మరో ఇద్దరు ఎమ్మెల్యే లు పార్టీ ఫిరాయిస్తే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. వాస్తవానికి 12 మంది సభ్యులు ఉంటె ప్రతిపక్ష హోదా నిలబడుతుంది. కానీ టి.కాంగ్రెస్ లో జంప్ జిలానీలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష హోదా నిలబడే పరిస్థితి అస్సలు కనబడటం లేదనే చర్చ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తరువాత అవుటయ్యేదెవరో అని అంతా అనుకుంటున్నారు.

Related posts

టిడిపి ఊసరవెల్లి రాజకీయాలు!

ashok p

చంద్ర‌బాబుకు షాక్ ఇస్తున్న టీడీపీ మంత్రులు..!

Manaaksharam

32 మందితో జనసేన రెండో జాబితా విడుదల

Manaaksharam