Mana Aksharam
  • Home
  • News
  • Andhra
  • టీడీపీ అభ్యర్థుల జాబితా రెడీ… ఇవాళ సాయంత్రమే ముహుర్తం
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

టీడీపీ అభ్యర్థుల జాబితా రెడీ… ఇవాళ సాయంత్రమే ముహుర్తం

అధికార పార్టీ తెలుగుదేశం ఎన్నికల అభ్యర్థుల జాబితా రెడీ అయ్యింది. ఇవాళ మంచి రోజు కావడంతో తొలజాబితాను ప్రకటించేందు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కి రావడంతో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ఉదయం పోలిట్ బ్యూరో భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు అధినేత చంద్రబాబు. ఉదయం పొటిట్ బ్యూరో సమావేశంలోనూ, ఆ తర్వాత మంత్రులతో జరిగే సమావేశంలో జాబితాపై చర్చించనున్నారు. ఇప్పటికే పొలిట్‌బ్యూరో సభ్యులు, మంత్రులు అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించారు. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

అభ్యర్థుల ప్రకటనపై పొలిట్‌ బ్యూరోలో చంద్రబాబు నేతలతో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకు టికెట్లు ఇచ్చాం… ఏ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామనే అనే అంశాలపై నేతలకు చంద్రబాబు వివరిస్తారు. తర్వాత జరిగే మంత్రుల సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. జాబితా ప్రకటనకు సాయంత్రం 7: 15 గంటలకు ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు. తొలి జాబితాలో 120కిపైగా ఎమ్మెల్యే, 14 ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో నామినేషన్ల గడువు ముగిసే ముందురోజు వరకూ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం నోటిఫికేషన్ వెలువడానికి ముందే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం విశేషం.

అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మార్చి 16 నుంచి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. శనివారం తొలుత తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చిత్తూరు జిల్లా టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం శ్రీకాకుళం బయలుదేరి వెళ్లనున్నారు.

Related posts

చంద్రబాబుకు భయం లేదు.. భక్తి లేదు..! : వైస్ జగన్

ashok p

విజయసాయి దెబ్బకి తలపట్టుకున్న బీజేపీ!

Manaaksharam

ఆస్తుల్లో చంద్రబాబుకు తొలి స్థానం! 4వ స్థానంలో కేసీఆర్‌

ashok p