Mana Aksharam
Entertainment Gossips

టైం ఫర్ రొమాన్స్

prabhas sahoo latest

బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఇక ‘సాహో’ అనగానే అందరికీ యాక్షన్‌ అంశాలే మొదట గుర్తొస్తాయి. ఇప్పటి వరకు రిలీజ్‌ చేసిన ఈ చిత్రం టీజర్, ఫస్ట్‌ లుక్‌లతో పాటు ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో, షేడ్స్‌ ఆఫ్‌ సాహో 2’ వీడియోస్‌లో కూడా యాక్షన్‌ అంశాలే ఎక్కువగా కనిపించి అలరించాయి. అయితే… ‘సాహో’లో మంచి రొమాంటిక్‌ యాంగిల్‌ కూడా ఉన్నట్లు తాజాగా లీక్ అయినా పిక్ చూస్తే తెలుస్తోంది. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల వీరిద్దరిపై ఓ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌ కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది.

ఇది ‘సాహో’ చిత్రంలోనిదేనని అనుకుంటున్నారు. పైన ఉన్న ఫొటో అదే. ఈ ఏడాది ఆగస్టు 15నూన ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రానికి శంకర్‌–ఎహసన్‌–లాయ్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంతో పాటు ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే… ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ పాత్రల పరిచయం ప్రభాస్‌ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభం అవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Related posts

దుస్తులు చించేయండి.. వీహెచ్‌పై వర్మ వివాదాస్పదం

Masteradmin

రామ్ చరణ్ రాజమౌళి తీన్మార్

Manaaksharam

అవన్నీ నమ్మకండి మేము బాగానే ఉన్నాం!

admin