Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • తొలిరోజు బాగానే రాబట్టిన ‘చిత్రలహరి’
Cinema Entertainment Homepage-Slider

తొలిరోజు బాగానే రాబట్టిన ‘చిత్రలహరి’

మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్, ‘నేను శైలజ’ దర్శకుడు కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘చిత్రలహరి’. సాయిధరమ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటించారు. ఎన్నో అంచనాలతో శుక్రవారం(ఏప్రిల్ 12) ప్రేక్షలకు ముందుకొచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. కాన్సెప్ట్ పాతదే అయినా దర్శకుడి ప్రతిభ, ధరమ్‌తేజ్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు బాగానే రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ‘చిత్రలహరి’ తొలిరోజు రూ.3.08కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో వారాంతంలో ఈ సినిమా రూ.8-10కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా రూ.11.50కోట్ల రాబట్టిన ఈ చిత్రం వారం రోజుల పాటు స్టడీగా కలెక్షన్లు రాబడితే డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వరుసగా ఆరు ప్లాపుల తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా కావడంలో ‘చిత్రలహరి’పై అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీతో అయినా తేజ్ ప్లాపులకు అడ్డుకట్ట వేస్తాడా అని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూశారు. దీనికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వాళ్ల ఆశలు ఫలించినట్లే కనిపిస్తోంది.

ఏరియాల వారీగా కలెక్షన్లు
నైజాం- రూ.86లక్షలు

సీడెడ్- రూ.51లక్షలు
కృష్ణా- రూ.24లక్షలు
గుంటూరు- రూ.30లక్షలు
నెల్లూరు- రూ.14లక్షలు
వెస్ట్- రూ.24లక్షలు
ఈస్ట్- రూ.38లక్షలు
యూఏ- రూ.41లక్షలు

Related posts

కథానాయకుడు ట్విట్టర్ రివ్యూ

Manaaksharam

మేకపాటికి అస్వస్థత

Masteradmin

హైదరాబాద్‌కు పూర్తిగా దూరమైపోయిన బాబు!

Masteradmin