Mana Aksharam
  • Home
  • News
  • Technology
  • తొలిసారిగా భారత దేశంలో ‘ఇంటర్నెట్ కారు’
News Technology

తొలిసారిగా భారత దేశంలో ‘ఇంటర్నెట్ కారు’

first internet car in india

బ్రిటన్‌కు చెందిన వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్..దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. వచ్చే జూన్‌లో తన తొలి ఇంటర్నెట్ కారైన ‘హెక్టార్‌’ను విడుదల చేయబోతున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఐస్మార్ట్ టెక్నాలజీతో ఈ కారును రూపొందించడానికి అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, అడోబ్, సాప్‌లతో జతకట్టింది. భారత దేశ మార్కెట్లో లభించనున్న తొలి ఇంటర్నెట్ కారు ఇదేనని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. వచ్చే రెండేండ్లలో నాలుగు నూతన కార్లతోపాటు హైబ్రిడ్, విద్యుత్‌తో నడిచే వాహనాన్ని సైతం విడుదల చేయబోతున్నట్లు ఎంజీ మోటర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా తెలిపారు. ఐస్మార్ట్ నూతన టెక్నాలజీతో రూపొందించిన ఈ కారు డోర్లు మాటలతో తెరుచుకుంటాయట. సిమ్ కార్డు ద్వారా ఈ కారును అనుసంధానం చేయడం ద్వారా నూతన టెక్నాలజీ సేవలు అందించడానికి వీలుంటుంది.

Related posts

ఏసీ రూములో కులుకుతున్న బాలకృష్ణ!

admin

మరో 30 వస్తువులపై తగ్గిన జీఎస్టీ

admin

షికాగో సెక్స్‌ రాకెట్‌ కేసు వెనుక టీడీపీ పెద్దలు : వాసిరెడ్డి

admin