Mana Aksharam
  • Home
  • News
  • త్వరలో సోనీ ఈ-పేపర్ వాచ్
Homepage-Slider News Technology

త్వరలో సోనీ ఈ-పేపర్ వాచ్

త్వరలో సోనీ ఈ-పేపర్ వాచ్

పాన్ కి చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ సోనీ ఎలక్ట్రానిక్ పేపర్ తో వాచ్ ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలలో ఉంది. వచ్చే ఏడాదిలోనే ఈ ఈ-పేపర్ వాచ్ ని విడుదల చేసేందుకు కృషి చేస్తోంది. కొత్త ఉత్పత్తుల తయారీకి సంస్థ కొత్తగా చేపట్టిన వెంచర్-శైలి విధానాన్ని పాటిస్తున్నట్టు తెలిసింది.

ఈ కొత్త వాచ్ ఉపరితలం, రిస్ట్ బ్యాండ్ లు ఒక పేటెంట్ పొందిన పదార్థం నుంచి తయారు చేయనున్నారు. వాచ్ ఉపరితలం అంతా డిస్ ప్లేగా పనిచేసేలా, తన రూపాన్ని మార్చుకొనేందుకు అనువుగా ఈ మెటీరియల్ ఉండనుంది.

ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఆపిల్ వాచ్, సోనీ స్మార్ట్ వాచ్ లను సాంకేతిక అంశాలలో అధిగమించేందుకు ప్రయత్నించకుండా ఈ పరికరం తయారీలో ప్రధానంగా స్టైల్ పై దృష్టి పెట్టారు. సరికొత్త, మేలైన ఉత్పత్తులను వేగంగా తయారు చేసేందుకు ఈ ఏడాది సీఈవో కజువో హిరాయ్ ఒక ప్రత్యేక వ్యాపార విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాని నుంచి మొదటి ప్రయత్నంగా ఈ వాచ్ ని విడుదల చేయనున్నారు.

Related posts

చంద్రబాబుకు భయం లేదు.. భక్తి లేదు..! : వైస్ జగన్

ashok p

ఆంధ్రజ్యోతికి చంద్రబాబు మరో ఫేవర్!

ashok p

గెలుపు గుర్రాలతో గులాబీ బాస్ కీలక సమావేశం!

ashok p