దిశా ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన ఉదయభాను

హైదరాబాద్ లో జరిగిన దిశా ఘటన యావత్ దేశాన్ని వణికించింది.రాష్ట్ర రాజధానిలో హైవే పైన జరిగిన ఈ ఘటన పట్ల ప్రతి ఒక్కరు గొంతెత్తుతున్నారు.నిందుతులకు శిక్ష పాడాలంటున్నారు.తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలనాటి యాంకర్ ఉదయభాను మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.ఆ సంఘటన జరిగినప్పటి నుండి తాను నిద్రపోలేకపోతున్నానని,ఆ అమ్మాయి ఎంత బాధ అనుభవించిందో అని కన్నీటి పర్యంతమయ్యారు.చిన్న పిల్లలను కూడా వదలని ఇలాంటి కామాంధులు వున్నా దేశంలో పుట్టటం మన దౌర్భాగ్యమని అసలు రాజకీయ నాయకులూ బాగుండి సరైన శిక్ష వేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని చెప్పారు ఉదయభాను.నాకు ఇద్దరు ఆడపిల్లలని వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే రోజు భయంగా ఉందని ఎప్పుడు ఈ అఘాయిత్యం జరుగుతుందో అని బయపడుతూ బతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు ఉదయభాను

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*