Mana Aksharam
  • Home
  • News
  • నాని సోద‌రుడు దుర్మ‌ర‌ణం.. విషాదంలో కుటుంబం
Andhra Breaking Crime Headlines News

నాని సోద‌రుడు దుర్మ‌ర‌ణం.. విషాదంలో కుటుంబం

నాని సోద‌రుడు దుర్మ‌ర‌ణం.. విషాదంలో కుటుంబం

ఓ వైపు ఎమ్మెల్యేనే అనుకుంటే అటు దేవుడు కూడా ప‌గ‌బ‌ట్టిన‌ట్లున్నాడు నాని విష‌యంలో.

ఎమ్మెల్యే అరాచ‌కాల‌పై పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కామిరెడ్డి నానికి మ‌రో క‌ష్టం వ‌చ్చి ప‌డింది. ఆయ‌న‌ నివాసంలో విషాదం నెలకొంది.

నానికి వరసకు సోదరుడైన ఆదిత్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

కాగా దెందులూరు ఎమ్మెల్యే దళితులపై చేసిన అనుచిత వ్యాఖ‍్యల వీడియోను షేర్‌ చేశారంటూ కామిరెడ్డి నానిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం ఆయ‌న్ని బెయిల్‌పై విడుదల చేశారు.

అటు సోదరుడి (నాని) అరెస్ట్‌ను నిరసిస్తూ ఆదిత్య శ‌నివారం రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌ వద్దే బైఠాయించారు.

మరోవైపు కామిరెడ్డి నానికి బెయిల్‌ మంజూరు కావడంతో ఆదిత్య.. తన బంధువులను ఇంటి వద్ద దించేందుకు కారులో వెళ్తుండ‌గా పెదవేగి మండలం వేగివాడ గ్రామ శివారు వద్ద ఆదిత్య ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆదిత్య అక్కడికక్కడే మరణించారు.

మరోవైపు ఆదిత్య మృతి పట్ల వైఎస్సార్‌ సీపీ నేతలు ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్‌ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్‌, దెందులూరు కన్వీనర్‌ కొఠారు అబ్బయ్య చౌదరి తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

కామిరెడ్డి పరామర్శించిన నేతలు వారికి మనోధైర్యం చెప్పారు.

Related posts

జనసేన టిక్కెట్ల కోసం క్యూ.. భారీగా దరఖాస్తులు!

Manaaksharam

ట్విట్టర్ లో లోకేష్ , కేటీఆర్ ‘వన్ అండ్ టూ’

ashok p

కల్పన కలలు కల్లలేనా..?

ashok p