Mana Aksharam
  • Home
  • Breaking
  • నా పోరాటం ఆగదు…. రేవంత్ రెడ్డి
Andhra Breaking Editorial Headlines Homepage-Slider National News Politics

నా పోరాటం ఆగదు…. రేవంత్ రెడ్డి

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కుంగిపోకుండా కార్యకర్తలు మనోనిబ్బరాన్ని కోల్పోకుండా వారిలోమనోధైర్యాన్ని నింపాల్సిన భాద్యత ముఖ్యనాయకులపైనే ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వార్ జోన్ ని తలపిస్తున్నాయని రేవంత్ అన్నారు. 2014 లో భారీ మెజారిటీతో గెలిచినా బిజెపి , మూడు నెలల్లో వచ్చిన ఢిల్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందో అందరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ అన్నారు. ఎప్పుడూ తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చే రేవంత్ రెడ్డి, కొంత గ్యాప్ తరువాత మళ్ళి తన పదునైన మాటల తూటాలు సంధించడం ప్రారంభించారు. ఈ సారి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను గచ్చిబౌలి దివాకర్ తో పోల్చారు. కాంగ్రెస్ మాత్రం టెండూల్కర్ లాంటిదని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా సమస్యలు, సవాళ్లు ఎన్ని ఎదురైనా ఎదురొడ్డి పోరాడాల్సిన సమయం ఆసన్నమైనది రేవంత్ అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లీడర్ గా కొన్ని సవాళ్లు ఎదుర్కోక తప్పదని అన్నారు. పార్టీ ఆదేశిస్తే యంపీ గా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ ప్రకటించారు. రేవంత్ ప్రకటన విన్న కాంగ్రెస్ కార్యకర్తకు ఒక్క సారిగా ఎడారిలో ఎదురీదుతున్న వ్యక్తులకు దప్పిక తీర్చే నీటి మడుగుడు దొరికినట్లుగా ఆనందంతో పరవశించిపోయిన పరిస్థితి. మొన్నటికి మొన్న పార్టీ వలస వాదులను ఆప్ ప్రయత్నం, తాజాగా పార్టీ ఆదేశిస్తే పార్లమెంటు స్థానానికి పోటీకి సిద్ధమన్న ప్రకటన చూసి రేవంత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు , అభిమానులు, కార్యకర్తలు ఒక్క సారిగా వెయ్యిఏనుగుల బలం పుంజుకున్నంత ఉస్తాహంలో ఉన్నారు. అయితే ఈ ప్రకటన కాంగ్రెస్ ఢిల్లీ రాయబారులను సైతం సంతోషపడేలా చేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి తెలంగాణా పులిబిడ్డ రేవంత్ రాజకీయ రణరంగంలో ఈసారి కొదమసింహంలా దూసుకెళ్తాడనే వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం ఈసారి రేవంత్ పక్కా ప్లాన్ తోనే బరిలో దిగడానికి సిద్ధమయ్యాడని, గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలను విశ్లేషించుకుని పూర్తిస్థాయి కసరత్తుతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉండిఉంటారని అనుకుంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి ఎన్నికల తరువాత ఇంటికి పరిమితమయ్యాడని అంతా అనుకున్నారు కానీ, పార్లమెంటు ఎన్నికల బరిలో అధికార పార్టీని సమర్ధవంతంగా ఎలా ఎదుర్కోవాలో పటిష్టమైన ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమనిమగ్నమయ్యే ఆయన బయటకు రాలేదని విశ్లేషకులు సైతం అనుకుంటున్నారు. ఇది తెలుసుకున్న ప్రజలు అభిమానులు రేవంత్ అన్న ఏం చేసినా వాటికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక, అర్ధం ఉంటాయని, ఏదిఏమైనా మళ్ళీ పోరాటవీరుడు పోటెత్తబోతున్నాడు అని వారి అభిమాన నాయకుడైన రేవంత్ రెడ్డి గురించి చర్చించుకుంటున్నారు.

Related posts

ఏపీలో బీజేపీ నెంబర్‌వన్‌:మురళీధరరావు

ashok p

కేసీఆర్‌ సవాల్‌కు.. కాంగ్రెస్‌ ప్రతి సవాల్..!

ashok p

హఠాత్తుగా కుప్పకూలిన భారీ హోర్డింగ్: నలుగురు మృతి(వీడియో)

Manaaksharam