Mana Aksharam
  • Home
  • News
  • నేను ఎవరికీ వ్యతిరేకం కాదు
Editorial National News Politics

నేను ఎవరికీ వ్యతిరేకం కాదు

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ పై వ్యతిరేకత చూపుతూ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టి ప్రజల తరపున తన గళం వినిపిస్తున్నారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా పోటీ చేయట్లేదని, తాను ప్రజల కోసం పోరాడుతున్నానని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సరైన నాయకుడిని ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు, ఒకవేళ ఎన్నుకోకపోతే ప్రజలు నష్టపోతారని ప్రకాష్ రాజ్ అన్నారు. అభ్యర్థి ఏ పార్టీకి చెందిన వారన్న విషయం ముఖ్యం కాదని, సరైన నాయకుడా? కాదా? అన్న విషయాన్ని ఓటు వేయాలని ఆయన సూచించారు.

‘ఒక పార్టీ ఏడాదికి రూ.72,000 అందిస్తామని చెబుతోంది. మరోపార్టీ రైతులకు రూ.6,000 ఇస్తామని చెబుతోంది. మన డబ్బునే పన్నుల రూపంలో తీసుకొని, ఓ స్వచ్ఛంద సంస్థల్లా ఇస్తామని ఆయా పార్టీలు చెబుతున్నాయి. ప్రతిపౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని భాజపా చెప్పిన మాట ఏమైంది. ఆ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. అంతేగానీ, వారి మేనిఫెస్టోల్లో ప్రకటించిన అంశాల్లో ఓ విజన్‌గానీ, మంచి ఉద్దేశంగానీ లేదు’ అని ప్రకాశ్‌ రాజ్‌ పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ బెంగుళూరు నుంచి లోక్ సభకు పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.

Related posts

కాంగ్రెస్‌కు మరో షాక్..టీఆర్‌ఎస్‌లో చేరనున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే

Masteradmin

కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్‌ కీలక సమావేశం!

admin

ట్రంప్, కిమ్‌ భేటీ: గగనతలంపై ఆంక్షలు

Masteradmin