Mana Aksharam
  • Home
  • Entertainment
  • పవన్ త్రివిక్రమ్ పై శ్రీ రెడ్డి బాంబు
Entertainment

పవన్ త్రివిక్రమ్ పై శ్రీ రెడ్డి బాంబు

sri reddy latest leaks

2018-19 సీజన్ శ్రీరెడ్డి ప్రకంపనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. గత ఏడాది మొదలైన శ్రీలీక్స్ ప్రహసనం ఇప్పటికీ కొనసాగుతోంది. టాలీవుడ్ లోగుట్టు మొత్తం శ్రీరెడ్డి బయటపెడుతోంది. అయితే శ్రీరెడ్డి చేస్తున్నవన్నీ ఆరోపణలేనా? ఆ వెనక ఉన్న ఉద్ధేశం ఇంకేదైనా ఉందా? అన్నది అటుంచితే.. ఇప్పటివరకూ డజను మంది పైగానే శ్రీరెడ్డి టార్గెట్ లిస్ట్ లో బయటపడడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

కొరటాల శివ.. నాని.. శివాజీ రాజా.. జీవిత రాజశేఖర్.. కత్తి మహేష్ వంటి వారిపై శ్రీరెడ్డి ఇప్పటికే ఎన్నో విషయాల్ని మీడియా ముఖంగా చెప్పే ప్రయత్నం చేసింది. ఈ జాబితాలో ఇంకా బిగ్ గన్స్ పేర్లు బయటపడుతున్నాయి. పవన్ – త్రివిక్రమ్ వంటి టాప్ రేంజ్ సెలబ్రిటీలపైనా శ్రీరెడ్డి ఇదివరకూ సంచలన ఆరోపణలు చేయడం చర్చకొచ్చింది. వీళ్లతో సంబంధాలు ఉన్నాయంటూ పూనమ్ కౌర్ – పార్వతి మెల్టన్ వంటి నాయికల పేర్లను శ్రీరెడ్డి ప్రస్థావించింది.

తాజాగా పూనమ్ కౌర్ ఆడియో టేప్ ఒకటి లీక్ చేయడం కలకలం రేపుతోంది. శ్రీరెడ్డి తన సొంత యూట్యూబ్ చానెల్ ద్వారా పలు సంచలన విషయాల్ని రివీల్ చేయడం వేడెక్కిస్తోంది. పూనమ్ కౌర్ సూసైడ్ ఎపిసోడ్.. పార్వతి మెల్టన్ ఘాటైన అఫైర్ గురించి మాట్లాడుతూ పవన్ – త్రివిక్రమ్ ఇద్దరూ అమ్మాయిల పిచ్చోళ్లు (ఉమనైజర్స్) అని విమర్శించారు. పవన్ వల్ల పూనమ్ కౌర్ చాలా బాధపడిందని.. తన కష్టాలు ఇండస్ట్రీలో ఎవరికీ తెలియవని తెలిపింది. పవన్ ను పూనమ్ కౌర్ చాలా ఇష్టపడింది. ఆయన దేవుడు. నాకు సర్వస్వం అని గతంలో చెప్పింది. ఆయనను పెళ్లి చేసుకోవాలని లేదు. కేవలం అనుబంధం ఉంటే చాలు అని శ్రీరెడ్డి తెలిపింది. ఆయన కారణంగా పూనమ్ సూసైడ్ చేసుకొంది అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇక పూనమ్ కౌర్ సూసైడ్ చేసుకుంటే ఎందుకు బిల్లు కట్టారు? ఆమె సూసైడ్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు ఎందుకు అంటగడుతున్నారు. నేనేదో ఒక్క మాట అంటే దానిపై ఎందుకు రాద్దాంతం చేశారు. పూనమ్ కౌర్ టేప్ లను మీడియా నుంచి ఎందుకు తీసేయాలని ఎన్నారైలు ప్రయత్నిస్తున్నారు? అంటూ చాలా సంగతుల్నే శ్రీరెడ్డి ప్రశ్నించింది. పార్వతి మెల్టన్ ను త్రివిక్రమ్ వేధించారని ఆయన ప్రేమల పడిన పార్వతి జీవితాన్ని కాలరాశాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్వతి మెల్టన్ ఆఫర్లు కోల్పోవడానికి త్రివిక్రమ్ కారణమని అంది.

నేను ఏ హీరోతో తిరుగలేదు. దర్శకుడితో అఫైర్ పెట్టుకోలేదు. పవన్ కల్యాణ్ ఫైవ్ స్టార్ హోటల్లో కలువడం తప్ప భయటకు వచ్చే ధైర్యం లేదు అంటూ ఆడియో టేప్ ని శ్రీరెడ్డి రివీల్ చేశారు. అమ్మాయిల జీవితంతో ఆడుకున్న పవన్ కి ఓటు వేయొద్దు! అంటూ శ్రీరెడ్డి ఇచ్చిన ట్విస్టు గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది.

https://youtu.be/HtnxTU-S-yo

Related posts

అదరహో అనిపించిన విద్యాబాలన్ !

Manaaksharam

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత

ashok p

ఘనంగా పెళ్లి.. ఒక్కటైన చైతు, సమంత

ashok p