Mana Aksharam
  • Home
  • Entertainment
  • పిచ్చి తుగ్లక్‌ కేసీఆర్‌ -బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
Entertainment News Telangana

పిచ్చి తుగ్లక్‌ కేసీఆర్‌ -బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

పగటికలలు కనడం లోముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దహస్తుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంలో మంత్రులు అవుతారని చెబుతున్నారని దుయ్యబట్టారు. మోదీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ విసిరానని.. దానికి టీఆర్ఎస్ స్పందనలేదని విమర్శించారు. తెరాస నేతల్లో అంతర్మథనం ప్రారంభమైందన్నారు. తెలంగాణలో ల్యాండ్‌ మాఫియా పెరిగిపోయిందని ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారని ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆదరబాదరగా వెళ్తున్నారని.. తుగ్లక్‌ మాదిరిగా కేసీఆర్ వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించి.. ఇంకా తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యవర్గ సమావేశాలు జరిపి స్థానిక సంస్థల అభ్యర్థులను ఎన్నుకుంటామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. రేపుజిల్లా ఇన్‌ఛార్జీల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఇందులో ఎన్నికలపై చర్చిస్తామని లక్ష్మణ్‌ తెలిపారు.

 

 

Related posts

హరీష్ రావు పై వంటేరు బాంబు!

Masteradmin

ఒట్టి చేతులతో ఏపీకి రావడానికి తలవంపుగా లేదా?: మోదీకి చంద్రబాబు లేఖ

Masteradmin

ఎమ్మెల్యేను రైలులో కాల్చి చంపేశారు

Manaaksharam