Mana Aksharam
  • Home
  • Sphoorthi
  • పురుషులతో సమానంగా కుస్తీ పోటీల్లో తలపడి గెలిచింది
Sphoorthi

పురుషులతో సమానంగా కుస్తీ పోటీల్లో తలపడి గెలిచింది

mahima rathode wins in wrestling competition

ఆడపిల్ల అని తక్కువ అంచనా వేసేరు. కుస్తీ మే సవాల్ అంటూ పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు. ఆడపిల్లలు కాదు ఆడపులులు అన్నట్లుగా విజృంభిస్తున్నారు. మగువల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ అని ముక్కు తిమ్మనార్యుడి మాటలు నిజం చేశారు. కుస్తీ పోటీల్లో పురుషులతో పాటు సమానంగా మహిళలు రాణిస్తారని నిరూపించారు ఓ బాలిక.

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరాలో కుస్తీ పోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీలు అనగానే పురుషుల క్రీడ అనుకుంటారు అంతా కానీ ఈ పోటీల్లో పురుషులతో పోటీపడింది మహారాష్ట్రకు చెందిన మహిమా రాథోడ్ అనే బాలిక. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా పూసత్ తాలుకా దుర్గాగిరి గ్రామానికి చెందిన పదిహేడేల్ల మహిమ రాథోడ్ కుస్తీ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ధర్మాబాద్ కు చెందిన దేవి దాస్ తో నువ్వా నేనా అన్నట్టు తలపడి విజయం సాధించింది.

తొమ్మిది సంవత్సరాలుగా కుస్తీ పోటీల్లో పాల్గొంటూ వస్తోంది మహిమ రాథోడ్. పాల్గొన్న ప్రతి పోటీలోనూ విజయపథంలో నిలిచింది. పురుషులతో జరిగిన పోటీలో గెలుపొందిన మహిమా రాథోడ్ కు ఐదు వేల రూపాయల నగదు బహుమతి ఇచ్చారు నిర్వాహకులు. దీంతో చదువులోనే కాదు, కుస్తీ పట్టడం లోను మాకు మేమే సాటి, మాకు లేరు ఎవరు పోటీ అంటున్నారు అమ్మాయిలు.

Related posts

ఐఏఎస్, ఐపీఎస్‌లకు మోటివేషనల్ స్పీకర్‌గా పదమూడేళ్ల జాహ్నవి..

ashok p

స్నేహం కోసం

ashok p

అన్నార్తుల కోసం… అన్నీ వదులుకుని!

Manaaksharam