Mana Aksharam
  • Home
  • News
  • పులివెందులలో టిడిపి అభ్యర్ధి ఎవరో తెలుసా ?
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

పులివెందులలో టిడిపి అభ్యర్ధి ఎవరో తెలుసా ?

పులివెందులలో టిడిపి అభ్యర్ధి ఎవరో తెలుసా ?

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధి ఫైలన్ అయ్యింది. వచ్చే ఎన్నికల్ల జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేయటానికి సతీష్ తో పాటు ఎంఎల్సీ బిటెక్ రవి కూడా పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం సతీష్ వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీపై నాలుగుసార్లు పోటీ చేసి ఓడిపోయిన SV సతీష్ కుమార్ రెడ్డి నే మళ్ళీ ఐదోసారి కూడా పోటీలోకి దింపాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. నిజానికి పులివెందుల నియోజకవర్గమన్నది పార్టీతో సంబంధం లేకుండా వైఎస్ కుటుంబం కంచుకోటలాగ తయారైంది.

వైఎస్ కుటుంబం తరపున ఎవరు నామినేషన్ వేసినా గెలుపు ఖాయమే. అంటే వైఎస్ కుటుంబానికి పులివెందులలో అంతటి పట్టుంది. అటువంటి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధిగా సతీష్ వైఎస్ రాజశేఖ రెడ్డి మీదే కాకుండా జగన్ మీద కూడా వరుసగా నాలుగుసారి పోటీ చేసి ఓడిపోయారు.

సరే రేపటి ఎన్నికల్లో కూడా ఇక్కడ జగన్ నామినేషన్ వేయటమన్నది ఏదో లాంఛనమనే అనుకోవాలి. అదే విధంగా టిడిపి కూడా పోటీ చేయాలి కాబట్టి పోటీ చేస్తోందని భావించాలి. అంతేకానీ ఏదో అద్భుతం జరిగిపోతుందనో లేకపోతే సతీష్ అఖండి మెజారిటీతో గెలుస్తారనో అనుకోవటం లేదు. పోయిన ఎన్నికల్లో జగన్ కు 124576 ఓట్లొస్తే టిడిపి అభ్యర్ధి సతీష్ రెడ్డికి 49333 ఓట్లు మాత్రమే వచ్చాయి.

అయితే, టిడిపి వాదన ఏమిటంటే జిల్లాకు, పులివెందుల నియోజకవర్గానికి సాగు, తాగు నీళ్ళిచ్చాం కాబట్టి జనాలు తమనే గెలిపిస్తారని అనుకుంటున్నారు. గండికోట లాంటి ప్రాజెక్టుల నుండి టిడిపి నీళ్ళు విడుదల చేసింది నిజమే. కానీ ఆ ప్రాజెక్టు పనుల్లో అత్యధికం వైఎస్ హయాంలోనే పూర్తయిపోయాయన్న విషయం కూడా అంతే వాస్తవం.

Related posts

విశాఖలో మరో 200 కోట్లు భూ కుంభకోణం!

ashok p

టీఆర్‌ఎస్‌ నుంచి నాకు ప్రాణహాని!

ashok p

రాజకీయాల నుంచి తప్పుకుంటా… అన్నా వదల్లేదు!

Manaaksharam