Mana Aksharam
  • Home
  • Entertainment
  • పెళ్లి చూపులు ‘రీతూ’ ఏమైపోయింది
Entertainment

పెళ్లి చూపులు ‘రీతూ’ ఏమైపోయింది

ritu varma latest movies

పెళ్లి చూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది రీతు వర్మ. బొమ్మరిల్లు హాసినికి వచ్చినంత పేరు వచ్చింది. జెనీలియాలా పెర్ఫామర్ కాబట్టి దూసుకెళుతుందనే అనుకున్నారంతా. కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న తీరుగా రీతూ వర్మ కెరీర్ పరంగా స్పీడ్ పెంచడంలో ఫెయిలైపోయింది. తమిళనాట చియాన్ విక్రమ్ లాంటి స్టార్ హీరో ధృవనక్షత్రంలో అవకాశం ఇచ్చినా ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది రీతూ. కానీ ఇంతవరకూ అది కూడా రిలీజ్ కాలేదు. ఇక ఇదివరకూ రిలీజైన ధనుష్ వీఐపీ 2 చిత్రంలో రీతు అతిధిగా మెరిసింది. కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.

ఇదేగాక దుల్కార్ సల్మాన్ సరసన కానుమ్ కానుమ్ కొల్లయదితాల్అనే చిత్రంలో నటించింది. ఆ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు ఇప్పటివరకు. తెలుగు తెరకు పూర్తిగా దూరమైనందుకు కనీసం తమిళంలో అయినా టాప్ స్లాట్ కి చేరుకుందా? అంటే ఇప్పటివరకూ రీతూ నటిస్తున్న సినిమాలన్నీ సెట్స్ పైనే ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈ అమ్మడి సందడి కనిపించలేదు. కెరీర్ పరంగా ఆశించిన దూకుడు కనిపించట్లేదు.

ప్రస్తుతం రీతూ అతిధిగా నటించిన తెలుగు మౌనమే ఇష్టం రిలీజ్ కి సిద్ధమైంది. ఆర్ట్ డైరెక్టర్ గా దాదాపు 150 సినిమాలకు పైగా వర్క్ చేసి ఐదు నంది అవార్డులు గెలుచుకున్న ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ దర్శకత్వంలో ఏకే మూవీస్ పతాకంపై ఆశా అశోక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ కార్తీక్ – పార్వతి అరుణ్ హీరో హీరోయిన్లు. రీతూ వర్మ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం మార్చి 15 న విడుదలవుతోంది. హైదరాబాద్ లో తాజా ప్రచార కార్యక్రమంలో కనిపించిన రీతూ ఓ అద్భుతమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో కొంత గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని తెలిపింది. అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలి? అన్న పాయింట్ చుట్టూ ఈ సినిమా కథాంశం ఉంటుందట. తన పాత్రకు ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉందని చెబుతోంది. కనీసం ఈసారైనా పెళ్లి చూపులు భామ నెక్ట్స్ లెవల్ కి వెళుతుందా.. లేదా? అన్నది చూడాలి.

Related posts

సైరా తో మగధీరుడు

ashok p

గత జన్మలో పవన్ కళ్యాణ్ ఏంటో తెలుసా ?

ashok p

అవును రా నేను పొట్టి అయితే నీకేంది నొప్పి !

Manaaksharam